ప్రత్యేక హోదా : రాష్థ్ర బంద్‌

SM

రాష్ఠ్ర  విభజన సమయంలో నాడు పార్లెమెంటులో నాటి ప్రధాని  హామి ఇచ్చిన ప్రత్యేక హోదా కొరకు -నేటి కేంద్ర ప్రభుత్వ పెద్దలు వంతె పాడిన  ప్రత్యేక హోదా కొరకు – గత అసెంబ్లి ఎన్నికల్లో తె.దే.పా -భా.జ.పా హామీ ఇచ్చిన ప్రత్యేక హోదా కొరకు   ఈ రోజు ( 29,ఆగస్టు,2015) బంధ్ నిర్వహిస్తున్నారు .ప్రధాన ప్రతిపక్షం వై.ఎస్.ఆర్ సి.పి ప్రకటించిన ఈ బంధుకు కమ్యూనిస్టులు కూడ మద్దత్తు పలికేరు . పై పైకి చూస్తే ఆహా ..ఉద్దేశం మంచిదేగా ? ఈ మాత్రం చెయ్యకుంటే ప్రత్యేక హోదా ఎలా వస్తుంది? అనిపిస్తుంది.
రాష్ఠ్ర ముఖ్యమంత్రి వర్యులు మాత్రం ఏ రూపంగా ఇస్తే ఏమి -ప్రత్యేక హోదాకంటే ఎక్కువగా నిదులిస్తారు “కోడలు మగ బిడ్డ కంటానంటే అత్త వద్దంటుందా?” అన్నారు . పై పైకి చూస్తే యధార్థమేగా చెబుతున్నారు అనిపిస్తుంది. రాజకీయాల్లో వచ్చే చిక్కేమంటే  నేతల మాటలు “ఆడవారి మాటలకు అర్థాలు వేరులే” లా ఉంటుంది .
ప్రతిపక్షం:
బంధ్ చేస్తే సమస్య పరిష్కారం అయి పోతుందా? ఇప్పటికే విభజనతో హైదరాబాద్ ఆదాయం పోగొట్టుకుని -లోటు బడ్జెట్లో ఉన్న ప్రభుత్వం మీద మరింత భారమే పడుతుంది.
విభజన సమయంలోనూ ఇదే పొరభాటు చేసారు. వారాల కొద్ది బంధులు . నిద్రపోయేవాడ్ని ఇట్టే లేపేయ్యొచ్చు. నిద్రపోయేలా నటించేవాడ్ని లేప గలమా? అందుకని “ఊరకుండమని” చెప్పను. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచాలంటే అందుకు పాటించాల్సింది బంధ్ కాదు. వేరే ..వేరే మార్గాలున్నాయి.
పాలక పక్షం:
డిల్లీనుండి తిరిగొచ్చి తనేదో ఘన కార్యం సాధించినట్టుగా సి.ఎం బీరాలు పలికారు .కాని రేపు మళ్ళీ డిల్లీ పయనం . బంధ్ పిలుపే ఇందుకు కారణం అని నేననుకోను . ప్రత్యేక హోదా రాదన్న బెంగతో జరుగుతున్న ఆత్మ హత్యలు ఈ పని చేసాయి. (అందుకని హోదా సాధనకు ఆత్మ హత్యలు మార్గమని నేను చెప్పను )
ఫెడరల్ వ్యవస్థ:
భినత్వంలో ఏకత్వం మన రాజ్యాంగం యొక్క ప్రధాన  స్పూర్తి . బ్రిటీషువారి రాకకు పూర్వం 56 దేశాలుగా ఉన్న దేశం ఇది. విబిన్నమైన మతాలు ,బాషలు,   సంస్కృతులు ఉన్న దేశం ఇది . దీనిని కాపాడుకోవాలంటే  భల పడవలసింది ఫెడరల్ స్పూర్తి -వ్యవస్థలే . కొన్ని కీలకమైన  వ్యవహారాలు తప్ప  -అంటే అంతర్జాతీయ సంభంధాలు ,జాతీయ బధ్రత,కరెన్సి ముద్రణ వంటివి తప్ప  తక్కినవన్ని  రాష్ఠ్ర ప్రభుత్వాల చేతుల్లో ఉండాలి .
వర్తమానం:
కాని వర్తమానం ఎలా ఏడ్చిందంటే కేంద్ర ప్రభుత్వం వద్దకు పరుగులు దీసి “దేహి దేహి” అని అడుకునే పరిస్థితి.  ఎప్పుడైతే కేంద్రంలో భలమైన నాయకత్వం ఏర్పడుతుందో అప్పుడెల్లా రాష్ఠ్రాల ప్రయోజనాలు అటకకెక్కుతాయి.  మోడి ప్రభుత్వం బంపర్ మెజారిటితో కొలువు తీరిన నాడే ఇటువంటివి ఉత్పన్నం కావడం ఖాయమన్న ఆలోచన  పాలక ప్రతి పక్ష నేతలకు కలిగి ఉండాలి.
కాని ఇప్పటికి కూడ జగన్ -బాబు ఇద్దరు ఒకరినొకరు మోడి మీదికి ఉసికొలుపుతున్నారే కాని కలిసి కట్టుగా ఎదుర్కొంటామన్న ఆలోచన కలగ లేదు .
ప్రత్యేక హోదా ఏమైనా చందానా? బిచ్చమా?  అది రాష్ఠ్ర ప్రజల హక్కు . ఇది విభజణ ప్రక్రియలో  ఒక భాగం . ఇది కుదరదంటే విభజన ఎలా చెల్లు బాటు అవుతుంది?
మెడలు వంచాలంటే:
రాష్ఠ్రంనుండి ఒక్క పైసా కూడ కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళకుండా చూడాలి . ఆ రోజు గాంధి లేవనెత్తిన సహాయ నిరాకరణ ఆయుధాన్ని చేపట్టాలి . ఎవరూ రైలెక్క పోతే ? ఎవరూ  ఆదాయ పన్నుకట్టకుంటే ? మోడి తలలోని జేజమ్మ దిగి వస్తుంది .
చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో వెనుకడుగు వేయడానికి ముఖ్య కారణం ఓటుకు కోట్లు .(ఇతర అవినీతి ఆరోపణలన్ని ఆరోపణల స్థాయిలోనే ఉన్నాయి)
ఇదేదో దేశంలోనే మొదటి సారిగా జరిగింది కాదు. జె.సి చెప్పినట్టు పొద్దునే కాఫి త్రాగినట్టు దేశ వ్యాప్తంగా  రోజూ జరిగేవే. జగన్ -కేసి.ఆర్ -చంద్రబాబు ఒక సారి కూర్చిని మాట్లాడితే తుస్సుమనే విషయమిది .
రేవంత్ రెడ్డి రాజినామా చేస్తాడు . తెలంగాణ తె.దే.పాలో ఉనికి కోసం ఈ తప్పటడుగు వేసాను -బాబుకు ఇందులో ఏ సంభందమూ లేదంటాడు  తెలుగు ప్రజల ఆత్మ గౌరవార్థం -తెలుగు ప్రభుత్వాల ప్రతిష్ఠను కాపాడటం కోసం కేసు వాపస్ అని కేసిఅర్ ప్రకటిస్తారు .  నా  నోట ఇక పై ఆ కేసు పై ఒక మాట రాదని జగన్ అంటారు . అంతే పైసల్ .చంద్రబాబు ఫ్రీ అవుతారు . కేంద్రంలో తె.దే.పా మంత్రులు రాజీనామా ఇస్తారు .ఇక్కడి భా.జ.పా మంత్రులను బాబు తొలగిస్తారు .
ఇంతే కాదు తెలుగు రాష్ఠ్రాల నడుమ ఉన్న సమస్యలకు పరిష్కారం చూపుతాం అన్న నెపంతో  పిల్లులకు కోతి భాగ పరిష్కారం ఛేసినట్టుగా కేంద్రం గేమ్ ఆడుతూంది కదా !  అదేదో రెండు రాష్ఠ్రాల సి.ఎంలు కూర్చుని “హేతు బద్దంగా”  పరిష్కారం చేసుకోవచ్చు .
కలిసి కట్టుగా రెండు రాష్ఠ్రాల మేళ్ళ కొరకు కేంద్రం పై వత్తిడి తేవచ్చు. ఇంతటితో ఆగక  ఫెడరల్ స్ఫూర్తిని భారత దేశంలోని అందరు ముఖ్యమంత్రులదాక తీసుకెళ్ళాలి .(భా.జ.పా పాలిత రాష్ఠ్రాలు తప్ప) .వారందర్ని కూడకట్టాలి .
ఆంద్ర రాష్ఠ్రంలోని ప్రతి పార్టి ,ప్రతి నేత,ప్రతి కార్యకర్త ఏకమై కేంద్ర ప్రభుత్వానికి రాహ్ఠ్రం నుండి ఒక్క పైసా ఆదాయం వెళ్ళకుండా చూస్తే చాలు .ప్రత్యేక హోదా తనంతట తానే పరుగు మీద వస్తుంది .
తెలంగాణ రాష్ఠ్రం కూడ తన డిమాండ్ల సాధనకు ఆంద్ర రాష్ఠ్రంతో కలిస్ వస్తే ఇక డబుల్ బ్యేరల్డు గన్నే !

 

caricature courtesy:Sugumarje