6. ఆలోచిద్దాం రా ! ( స్వేచ్చా స్వాతంత్రయం)

water queue

మనుషులతో వచ్చిన పెద్ద చిక్కేమంటే తామేదైతే పొంది ఉన్నారో దాని విలువ వారికి ఏమాత్రం తెలీదు. మరో దానికి కోసం ఆరాట పడుతుంటారు. తాము పొందిన దాన్ని పోగొట్టుకుంటే తప్ప దాని విలువ వారికి ఏమాత్రం తెలిసి రాదు. అది అమ్మైనా అంతే .. భార్య అయినా అంతే స్వేచ్చా-స్వాతంత్ర్యం అన్నా అంతే.
మన సినిమాల్లో మదర్ సెంటిమెంట్ ఇంతగా సక్సెస్ అయ్యింది కదా ? దానికి కారణమేమిటో ఒక్క సారైనా ఆలోచించారా? అమ్మ బతికున్న కాలంలో ఆమె విలువ తెలీక నిర్లక్ష్యం చేసిన అపరాధ భావంతో సినిమాలోని తల్లి పాత్రలో తమ తల్లిని , హీరో పాత్రలో తమర్ని ఊహించ్కుని జనం ఉబ్బి పోవడంతోనే మదర్ సెంటిమెంట్ ఇంతగా సక్సెస్ అవుతూంది.
తమిళ నాడులో శశి పెరుమాళ్ అనే ఓల్డ్ మేన్. గాందేయవాది. గత పదుల సం.లుగా మద్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. ఏకంగా 31 రోజులు సైతం నిరాహార దీక్ష చేసాడు. కాని అతన్ని ప్రభుత్వమే కాదు ప్రతి పక్షాలు సైతం పట్టించుకున్న పాపాన పోలేదు .
ఇటీవల తన ఉధ్యమంలో భాగంగా సెల్ టవర్ ఎక్కాడు. మండు టెండలో ఐదు గంటల సేపు మద్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేసాడు .అక్కడే తన ప్రాణాలు వదిలాడు. అతని మరణానంతరం ప్రతి నేత నోట ఆయన పేరే.
ఇదీ ఒక బతుకేనా? ఏదైనా సరే అవి అందుభాటులో ఉన్నప్పుడే దాని విలువ తెలిసి -దాన్ని కాపాడుకునే ప్రయత్నం చెయ్యాలి. కాని మనం?
మనం 1947 ఆగస్టు ,15 న స్వాతంత్రయం సాధించాం. అప్పట్లో మన జనాభా అంతా రోడ్ల కొచ్చి పోరాడారు అనుకోకండి. అప్పట్లో సైతం బ్రిటీషు వారి పై  సమర శంఖం పురించిన వార్ని “ఎదవల” క్రింద చూసిన వారు మరీ పెద్ద సంఖ్యలోనే ఉన్నారు .అంబేద్కర్ వంటి మేథావులు లోతుగా చర్చించి మన రాజ్యాంగాన్ని కూర్చేరు . వారు ప్రధానంగా పేర్కొన్న అన్ని విషయాలను ఈ 68  సం.ల్లో ఒక్కొక్కటే  గాలి కొదిలేసాం. వదిలేస్తున్నాం. ప్రాథమిక హక్కుల్లో ఈ తేదికి ఉన్నవి ఎన్ని ఊడ్చుకు పోయినవి ఎన్ని ఎవరికి ఎరుక?
నాకు తెలిసి రైట్ టు జాబ్ పాయె. రైట్ టు ప్రాపర్టి పాయే. ఇంతేనా పౌరులకు నాణ్యమైన త్రాగు నీరు ,విథ్య,వైద్యం ఉచితంగా అందివ్వాలిసింది ప్రభుత్వాల భాద్యత. కాని నేడు జరుగుతున్నదేంటి? క్యేన్ వాటర్ కొనుక్కుని మరి త్రాగాలి , వేలు వేలు ఫీజులు కట్టి చదువుకోవాలి .,లక్షల్లక్షలు పెట్టి చికిత్స చెయ్యించుకోవాలి.
స్వేచ్చ అనే చెట్టుకు రాజ్యాంగమే వేళ్ళు ,ఊడెలు .వాటినే నరుక్కుంటూ వస్తున్నాం. భావ ప్రకటన స్వేచ్చా అని ఒకటుంది . ఇది ప్రతి పౌరునికి ఉంటుంది. నేటి దినపత్రికలు , టివి చానళ్ళు అన్నీ నడిచేది ఈ హక్కు క్రిందే. కాని ఈ రోజు పత్రికల్లో ఏ వార్త రావాలో -ఏ వార్త రాకూడదో నిర్ణయించేది ఎడిటర్లు కాదు – పాఠకులు కాదు . అడ్వర్టైజర్స్ నిర్ణయిస్తారు.
రాజ్యానికి పునాది ప్రజలు .ప్రజలందరు చచ్చి పోతే ఎవరిని ఏలుతారీ ఏలికలు. జనం చచ్చి పోతున్నారు . మత కల్లోలాలు ,కులాల కురుక్షేత్రాలు పస్తులు ,రోడ్డు ప్రమాదాలు,ఆత్మ హత్యలు ,హత్యలు జనం ప్రాణాలు చింతకాయల్లా రాలి పోతున్నాయి. అదేముందిలే జనన-మరణాలు బ్యేలెన్స్ అయిపోతాయనుకోవద్దు.
పురుషాధిక్యత , వర కట్న వేదింపులు కారణంగా విథ్య-ఉధ్యోగం పొందిన అమ్మాయలు అసలు పెళ్ళీళ్ళే వద్దంటున్నారు . పురుషుల్లో పుంశత్వం పదిపోతుంది.
గ్లోబలైజేషన్,ప్రైవైటైజేషన్, పిపిపిలు ప్రపంచం ఎటు దూకితే అటే దూకాలని రూలేమి లేదుగా? మన భౌగోళిక ,సామాజిక స్థితి గతులను పట్టి ప్రజా శ్రేయస్సు కోరి దేనిని – ఏమెరకు అనుమతించాలో కూడ తెలీదు .తెలిసినా అమలు చేసే పరిస్థితి లేదు . ప్రపంచ దేశాలు అణు కేంద్రాలను మూసేస్తుంటే మన వాళ్ళు కొత్తగా తెరుస్తున్నారు .ప్రపంచంలో బ్యేన్ అయిన మందు మాకులు మన మార్కెట్లో విచ్చల విడిగా అమ్ముడు పోతాయి.
ఇక్కడ ఏది ఫ్రీ కాదు . స్వేచ్చా-స్వాతంత్ర్యం తో సహా. వీ హేవ్ టు పే. దేశం -పౌరసత్వం -స్వేచ్చా-స్వాతంత్ర్యం గురించి మీకు నాకు  తెలియక పోచ్చు కాని విదేశాలకు వెళ్ళినప్పుడు పాస్ పోర్టు పోగొట్టుకున్న వారిని అడిగి చూడండి . వారు చెబుతారు.
ఈ స్వేచ్చా-స్వాతంత్ర్యం చే జారి పోవడానికి ఎన్ని కారణాలు కావాలో అన్నీ పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటికైనా ఆలోచిద్దాం రా !