ఆలోచిద్దాం రా ! (PART:4)

NTR

మిత్రులారా!
గత 3 ఎపిసోడ్లు చదివి నన్ను ప్రోత్సహించిన మీతో ఒక శుభ వార్తను పంచుకోవాలనుకుంటున్నాను .అవును ఒక తమిళ చానల్లో బ్రహ్మంగారి గురించిన నా పొడవాటి ఇంటర్ వ్యూ వెలుబడనుంది .

Jpeg

Jpeg

ఈ నేపథ్యంలో చానల్ వారితో కలిసి గత మంగళ వారం కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠానికి వెళ్ళాల్సి వచ్చింది . ప్రస్తుత మఠాథిపతిని కలవడం -అతని ఆశిస్సులు పొందడం ఎంతో ఆనందాన్ని కలిగించాయి. ఇంటర్ వ్యూ విశేషాలను త్వరలో ఒక పోస్టుగా అందించే ప్రయత్నం చేస్తాను .
ఇదేదో ఒక్క రోజులో జరిగి పోయిన అధ్బుతం అనుకోకండి . దీని వెనుక 31 సం.ల కథ ఉంది . అవును .ఏ చిన్న విషయమైనా సరే అది కార్య రూపం దాల్చడానికి ఎంతో కాలం ముందుగానే కాలం తని పనిని ప్రారంభిస్తుంది .
సం.లు సూచించి మరి ఫ్లాష్ బ్యాక్ చెప్పడం ముసలోళ్ళ లక్షణం . మరి నా విషయంలో 48 ఏళ్ళ వయస్సులో ముసలివాడ్ని అయి పోయినా ఇటివలే నా పుత్రికా రత్నం ఒక పుత్ర రత్నాన్నికని మరి నన్ను తాతను చేసినా నాలో కుర్రతనం మాత్రం చావలే . సం.లు అసల్ గుర్తుండి చావవు. ఎదుటి వారికి అర్థం కావాలని కష్ఠపడి దగ్గర దగ్గర ఏదో సం.న్ని సూచించడం నా స్టైల్ .
స్వంత సోదిలో నేను సూచించే సం.లు అటు ఇటుగా ఉంటాయి అడ్జస్టవ్వండి .1884 లో ఎన్.టి.ఆర్ బ్రహ్మంగారి చరిత్ర సినిమా విడుదల చేసారు.అందాక బ్రహంగారి పేరు కూడ వినలే. అప్పటికి నా వయస్సు 17 . ఇంతకీ ఎన్.టి.ఆర్ ఎప్పుడు తెలుసంటే చాలంజ్ రాముడు రిలీజ్ తరువాత తెలుసు .
బ్రహ్మంగారు వంటి వైవిధ్య వ్యక్తిత్వం గల మహనీయుడు నన్నాకట్టుకోవడంలో ఆశ్చర్యం ఏమి లేదు -మరీ ఎన్.టి.ఆర్ అతని పాత్ర దరించారంటే చెప్పక్కర్లేదు. అప్పట్లో చర్చి వీథిలో రాముల వారి రథం నిలిపే చోట ఒక బడ్డి కొట్టుండేది. దాని నడిపే అతను కుల రీత్యా కరణం అయినప్పటికి బ్రహ్మంగారి బక్తుడు. పేరు కేశవన్ .బుర్ర మీసం అతని బ్రాండ్. ఈ పాయింట్ ఎందుకు నొక్కి చెబుతున్నానంటే సఖల మానవ కోటికి ఆరాధ్యుడైన బ్రహంగారిని సైతం ఒక కులానికి పరిమితం చేసేటంతగా సమాజంలో కులపిచ్చి రాజ్యమేలుతూంది.
ఎన్.టి.ఆర్ సినిమాలు చూసి తెలుగు నేర్చిన తమిళుడను నేను . తెరమీద ఎన్.టి.ఆర్ పేరు వస్తే థియేటర్లో దుమారం చలరేగిది. అందరు ముందుగా “అ” నేర్చుకుంటే నేను ఎం నేర్చుకున్నాను. ఇదిలా ఉంటే .. బ్రహంగారి సినిమా చూసి పిచ్చెక్కేటంత పనైంది . కేశవన్ ద్వారా ఆయనగారి మూల మంత్రాన్ని సైతం జపించే వాడ్ని . వచ్చి రాని తెలుగుతో బ్రహంగారి చరిత్రవంటి సబ్జెక్టును చదవాలంటే ఎంత కష్ఠమో ఊహించుకొండి. అయినా శ్రద్దగా చదివే వాడ్ని .
సరిగ్గా 16 సం.ల కాలం బ్రహంగారి గురించి చదవడం-వినడం -బుర్రకెక్కించుకోవడం జరుగుతూ వచ్చాయి. 2000 సం.లో ఆన్మీగం అనే తెలుగు మాస పత్రికలో బ్రహ్మంగారి జీవిత చరిత్రను తమిళంలో సీరియల్గా వ్రాసే అవకాశం సంపాదించాను . నాలుగు ఎపిసోడ్ల దాక పబ్లిష్ ఆయింది . పెద్దాయనకు (బ్రహ్మంగారు ) మత పిచ్చి -కుల గజ్జి లేవు గాని బ్రాహ్మణుల కులాహంకారాన్ని మాత్రం అంగీకరించలేదు .ఈ విషయాన్ని ముందు మాటలోనే తేట తెల్లం చేసినా అది కొందరి కంట ఆలశ్యంగా పడినట్టుంది .తమిళ ప్రింట్/విషువల్ మీడియాలో బ్రాహ్మణులది భలమైన వర్గం /లాబి . ఏం చేసారో ? ఏమన్నారో కాని సీరియల్ ఆగి పోయింది .
అక్కడ నుండి 15 సం.లు అప్పుడప్పుడు పెద్దాయన గుర్తుకొస్తే అతని గురించి ఒకటి అరా పోస్టులు నా బ్లాగుల్లో /సైట్లో వ్రాయడం మినహా మరే విశేషం లేదు .
నేను చెప్పిన తమిళ చానల్ వారు (వేందర్ టివి) సిద్ద పురుషుల జీవ సమాధుల పై ఒక సీరియల్ చేస్తున్నారు .మూండ్రావదు కన్ ( మూడో కన్ను) పేరిట అది ప్రసారం అవుతూంది (సెంచురిని సైతం పూర్తి చేసుకుంది) . ఆ ప్రోగ్రాం టీమ్ జీవ సమాధుల గురించి ఇంటర్ నెట్లో సెర్చింగ్ చేస్తుంటే పెద్దాయన గురించి నేను వ్రాసిన వ్యాశాలు వారి కంట పడ్డాయి. నాకు మెయిల్ చెయ్యడం -ఫోన్ సంభాష్ణలు – చివరికి షూట్ కూడ జరిగి పోయింది .
ఈ శోదంతా ఎందుకు చెబుతున్నానంటే నేనీ రోజు ఆలోచిద్దాం రా శీర్షికన కొన్ని విషయాల పై వ్రాస్తున్నాను . వీటితో ఇప్పటికిప్పుడు ఏమీ జరుగక పోవచ్చు .కాని భవిష్యత్తులో? అసలేం జరగదు అని గంటా పదంగా చెప్ప గలరా? ఊహూ.. చెప్పలేరు.
పెద్దాయన పై నాకింత ప్రీతి కలగడానికి కారణాలు చాల తక్కువే .
1.కర్నాటకలో పాపాగ్ని పీఠాథిపతి దత్త పుత్రునిగా -తండ్రి మరణానంతరం అతని వారసుడిగా మఠాథిపత్యం పొంది చల్లగా కాలం వెళ్ళ పుచ్చకుండా .. 14 ఏళ్ళ వయస్సులో తీర్థ యాత్రలు చే పట్టడం.
2. బనగానుపల్లెలో గోపాలన చేయడం . అక్కడి అచ్చమ్మ సర్వదాస్తులు ధార పోస్తానని ముందుకొచ్చినా ఆమె ఆథిత్యం పొంది అక్కడే చల్లగా ఉండి పోక – వంద కి.మీ ప్రయాణం చేసి కందిమల్లాయ పల్లెకు చేరుకోవడం (ఇప్పటి బ్రహంగారి మఠం)
3.బనగాను పల్లె, కర్నూలు ,హైదరా బాదు నవాబుల మన్నెనలు పోందినా వారు వందలాది ఎకరాల భూమి ఇచ్చినప్పటికి -కాసుల వర్షం కురిపించినప్పటికి “తేరగ వస్తే తిందామంటూ ” ఉండి పోక కష్టించి పని చేసి కుటుంభ పోషణ చెయ్యడం.
4.ముస్లీం అయిన సిద్దయ్యను ప్రథమ శిష్యునిగా అంగీకరించి గౌరవించడం – కొడుకులు -కూతురు ఉన్నప్పతికి తన దండం,పాదుకలు అతనికే ఇచ్చి అతని భక్తిని గుర్తించడం
5.మాదిగ అయిన కక్కయ్య మరియు అతని భార్యను శిష్యులుగా స్వీకరించి వారికి ముక్తి మార్గాన్ని చూపడం
6.మహిళలను గౌరవించడం -వారికి సమాన హక్కులు కల్పించడం గురించి ఆనాడే ప్రచారం చెయ్యడం
ఇప్పట్లో మత తత్వ శక్తులు పుంజుకు దేశ ప్రజలను హిందువులు – హిందువులు కాని వారు అని ,హిందువులను హిందుత్వా వాదులు -తఠస్తులని విభజించి పాలించ చూసే ఈ తరుణంలో బ్రహ్మంగారి సందేశాలు ఎంతో అవసరం .
ఓం నమో వీర బ్రహ్మేంద్ర స్వామినే నమ: