మొదటి జిల్లా పరిషద్ సర్వసభ్య సమావేశం అరుపులు , కేకలు మధ్య ప్రారంబం అయ్యింది. ఒక దశలో పోలీసుల సహకారంతో పరిస్థితిని అదుపులో తేవలసి వచ్చింది. వైఎస్ఆర్ పార్టి సమస్యలు వరుసగా ఏకరువు పెట్టడంతో టిడిపి పార్టి సభ్యులు మూకుమ్మడి దాడితో సభ దద్దరిల్లింది. కేకలు , అరుపులు లతో ప్రారంభం అయిన సభను చూస్తూ జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ చూస్తూ ఊరక ఉండిపోయారు.

ప్రభుత్వ సంక్షేమ పధకాలను ప్రజలకు చేరువ చేద్దాం . ప్రజలందరిని అభివృద్దిలో బాగాసామ్యం చేద్దాం అని జిల్లా పరిషద్ అద్యక్షులు శ్రీమతి గీర్వాణి గారు పిలుపు నిచ్చారు. రాష్ట్ర విభజన నేపద్యంలో మనమందరం ఇక్యతతో జిల్లా అభివృద్ధిలో పాలుపంచుకోవాలని MP, MLA, ZPTC సభ్యులను కోరారు. అధికారులు బాధ్యతగా పని చేసి జిల్లాను ఆదర్సవంతంగా తీర్చిదిద్దాలని ఆమె పిలుపు నిచ్చారు.

త్రాగునీటి సమస్యపై మంత్రి బొజ్జల గోపాల కృష్ణ రెడ్డి మాట్లాడుతూ , సమస్యను రాజకీయం చేయవద్దని, త్రాగునీటి సమస్య జిల్లాలో అదికంగా వుందని, ఈ సమస్యను అడిగా మించడానికి ప్రభుత్యం క్రుతనిచ్చయంతో వుందనితెలియ జేశారు. గత ప్రభుత్వాలు ఈ సమస్యపై పట్టించుకోకపోవడం వల్లే ఈ సమస్య దాపురించింది అని వివరించారు. మొత్తం మీద 17 అంశాలపై చర్చ జరగాల్సి వుండగా, కేవలం 6 అంశాలపై చర్చ జరిగింది.

టాంకర్ ల ద్వారా నీటి సరపరా

జిల్లాలో త్రాగునీటి ఎద్దడిని నివారించడానికి యుద్ద ప్రతిప్రాతిపదికన చర్యలు తీసుకొంటున్నామని , ట్యాంకర్ల ద్వారా నీటిని సరపరా చేస్తున్నామని శ్రీనివాసులు , ఇంజనీరు తెలిజజేసారు. 1202 గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరపరా చేస్తున్నామని సభకు తెలియ జేశారు.

పలమనేరు శాసన సభ్యులు అమరనాధ రెడ్డి మాట్లడుతూ అజెండాను ప్రక్కన పెట్టి త్రాగునీటిపైనే చర్చజరగాని పట్టు బట్టారు. తంబల్లపల్లె శాసన సభ్యలు వారి నియోజక వర్గ త్రాగునీటి సమస్యను వివరించి చర్యలు తీసుకోవాల్సిందిగా తెలియజేశారు.ఈ దశలో నగరి శాసన సభ్యురాలు రోజా మాట్లాడుతూ త్రాగునీటి సమస్యకు నిధులు విడుదల చేయడంలో జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. చైర్మన్ జోక్యం చేసుకొంటూ అడిగిన వాళ్లకు నిధులు విదుల చేసామని తెలియ జేశారు.

ఉపాధి హామీ పధకాలను 100రోజుల నుండి 150 రోజులకు పెంచాలని సభ్యులు తీర్మానించారు. ఈ సందర్బంగా DWMA పిడి ఈ పధకం క్రింద చేపట్టిన పనులను సభ్యులకు చదివి వినిపించారు.

Watch this news Video

News Reporter