*ఆంద్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధనపై రౌండ్ టేబుల్ సమావేశం *





Chevireddy Baskar Reddy
*ఆంద్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధనపై రౌండ్ టేబుల్ సమావేశం *
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవ తీసుకుని అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి. ఏపీ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లో ‘ప్రత్యేక హోదా సాధన’పై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఏపీకి ప్రత్యేక హోదా సాధించడంలో జెండాలు- అజెండాలు పక్కన పెట్టి అందర్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని ఈ సమావేశంలో పాల్గొన్న వివిధ పార్టీల నేతలు డిమాండ్ చేశారు.

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై టీడీపీ ఒత్తిడి చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ కేంద్ర మంత్రులను వెనక్కి పిలిస్తే.. కేంద్రం దిగొస్తుందని అన్నారు. ప్రత్యేక హోదాను సాధించుకునేందుకు చంద్రబాబుతో కలసి వస్తామన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో సాంకేతికపరమైన ఇబ్బందులున్నాయనడం పచ్చి అవకాశదానికి నిదర్శమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. ఏపీ విద్యార్ధి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు డీవీ కృష్ణాయాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సినీ నటుడు శివాజీ, కాంగ్రెస్ నాయకులు తులసీరెడ్డి, గిడుగు రుద్రరాజు తదితరులు పాల్గొన్నారు.