కొత్త రాజధాని ఎక్కడ? దొనకొండ ? విజయవాడ-గుంటూరు మద్య ???

కొత్త రాజధాని ఏర్పాటు పై నిర్దిష్ట ప్రతిపాదనలు ఏవి లేకుండా శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇవ్వడంతో, రాజధాని ఎక్కడ అనే ఊగిసలాట మొదలైనది. మొదట దొనకొండ రాజధాని గా పెడితే బాగుండు అని అభిప్రాయ పడ్డ కమిటీ, ఈ విధంగానే పత్రికలకు లీకు లిచ్చింది. దొనకొండ రాజధాని అయితే ఎలాంటి స్థలాభావ సమస్య ఉండదని అభిప్రాయ పడినది.

seemandhra-image

కొత్తరాజధాని విజయవాడ గుంటూరు మధ్య

ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ఏర్పాటుకు మంత్రి వర్గ సమావేశం నిర్ణయం తీసుకొంది. విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని వుంటే భాగుంటుందని మెజారిటి సభ్యులు అభిప్రాయ పడ్డారు. అక్కడి రైతులు రాజధాని స్థలసేకరకు ముందకు రాకుంటే ప్రత్యామ్నయ ఏర్పాట్లపై పరిశీలించాలని నిర్ణయం తీసుకోనున్నారు. ఈవిషయమై శాసనసభలో అధికార పార్టి నాయకులు ఒక నిర్దిష్ట ప్రతిపాదన చేయనున్నారు.

కొత్తగా ప్రత్యెక రాయలసీమ ఉద్యమం ???

కొందరు శ్రీ భాగ్ ఒడంబడిక ప్రకారం కర్నూలు రాజదాని చేయాలని సూచిస్తునారు. లేక పొతే సమస్య మళ్ళి ప్రత్యేక రాయలసీమ ఉద్యమానికి దారితీయ వచ్చునని మేధావులు అభిప్రాయ పడ్డారు. ఏళ్ల తరబడి సీమ వెనుకబాటుకు గత ప్రభుత్య విధానాలే కారణమని, వాటివిధానాల వలన సీమ తీవ్రంగా నష్టపోయిందని అభిప్రాయ పడ్డారు. కర్నూలు రాజధానిగా చేస్తే రాష్ట్రం అన్ని విధాలుగాను, అదేవిధంగా వెనుకపడ్డ రాయలసీమ ఇతోధికంగా అబివృద్ది సాదిస్తుందని మేధావుల అభిప్రాయం. రాయలసీమకు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నందున కర్నూలును రాజధానిగా చేయాలనీ అబిప్రాయపడుతున్నారు.

అసెంబ్లీలో ప్రకటన

శాసనసభ్యులంత ఒకేమాట మీద వుండాలని, నేను ప్రటించే రాజధాని విషయంలో సబ్యులు తలోమాట చెప్పరాదని, ముఖ్యమంత్రి హుకుం జారీ చేసినట్లు తెలుస్తుంది. మనలో మనం రాజధాని విషయంలో తలోమాట మాట్లాడరాదని మంత్రివర్గంలో ఆంక్షలు విధించినట్లు తెలియవచ్చింది. భూసేకరణ నిమిత్తం రైతులతో మాట్లాదెందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటుకు నిర్ణయించారు.