కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఎక్కడ?

సొంత రాజకీయ పార్టీ జైSamaikyandhra పార్టీ (JSP)ఏర్పాటు చేసిన మాజీ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎలక్షన్లో గోర పరాజయము తరువాత ఎక్కడా మీడియా ముందు ప్రత్యక్షం అవ్వలేదు. దీంతో అయన ఎక్కడ అని జనం గుసగుస లాడుతున్నారు.

kirankumarreddy

కాంగ్రెస్ తో విభేదించి సొంత పార్టీ పెట్టుకొని చెప్పుల గుర్తుతో పోటీ చేసి ఎలక్షన్లో ఓడి ఉన్న పరువుపోయి మీడియా ముందుకు రాక, హైదరాబాద్ లో లేక ఎక్కడ వున్నారని అందురూ అనుకొంటుండగా విశ్వనీయసమాచారం మేరకు అయన బెంగుళూరు లోఉంటున్నట్టు తెలియవచ్చింది. ఆయన తన ఇద్దరు సోదరులుతో విభేదించి బెంగుళూరు లో ఉంటున్నట్టు బోగట్ట..

ఇటీవల మీడియాలో అయన బిజెపిలో చేరుతున్నట్టు వార్తలు గుప్పుమన్నది. ఆయన గుజరాత్ కు చెందిన ఆదాని బ్రదర్స్ తో టచ్ లో ఉన్నట్టు తన ఇద్దరు సోదరులతో కలిసి బిజెపిలో చేరుతున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. కానీ అబిజ్ఞ వర్గాల సమాచారము మేరకు తన ఇద్దరు సోదరులు అతనిని బెంగుళూరు తరిమేసారని అక్కడ అతను తనుకున్న 300 ఎకరాల నేలను చదును చేసుకుంటున్నాడని అక్కడ కాలము గడుపుతున్నారని తెలియవచ్చింది.