ప్రగతికి మూలం గణపతి : చవితి ప్రత్యేకం

ganesha-wallpapers

నేడు మనం తనివి తీరా చెప్పుకుని ఆనందించే పురాణాలను మనకు అందించిన వారు వ్యాసమహర్షులు .నేటి మెగా సీరియళ్ళ రూపకర్తలకు మార్గ దర్శి ఆయనే. అయితే నేటి సీరియల్స్ మన ఓర్పును పరీక్షిస్తాయి, వ్యాస మహర్షి రచించిన పురాణాలు నేటికీ విద్యావంతులు, మహా మేదావులు మొదలుగొని నిరక్షరాస్యులను సైతం అలరిస్తాయి,మెప్పిస్తాయి.

అట్టి వ్యాసమహర్షికి గణపతి తోడు అవసరమైంది. అవును . వ్యాస మహర్షి ఆసుకవి. అనుకున్నదే తడవుగా శ్లోకాల వర్షం కురిపించగలడు. అతను మహాభారతాన్ని రచించాలని నిర్ణయించాడు.

గాలికన్నా వేగమైంది మనస్సు. ఆ మనస్సు -మరీ వ్యాస మహర్షి మనస్సు కవితలల్లే వేగానికి – చెయ్యి తిరగాలిగా?వాటికి అక్షర రూపం ఇచ్చేందుకే అతనికి గణపతి తోడు అవసరమైంది.

మానవ చరిత్రలో తొలి స్టేనోగ్రాఫర్ అక్షరాల మన గణనాథుడే. ఎన్నో ధర్మ సూక్ష్మాలను సైతం మనకు అందించే మహా భారతాన్ని అక్షర రూపంలో మనకు అందుబాటులో ఉంచించింది మన విఘ్నేశ్వరుడే. భక్తి, కర్మ,జ్ణాన యోగాలను మానవాళికి పూసగుచ్చినట్టుగా అందించే భగవద్గీత మహాభారతంలోని ఒక అంతర్భాగమే
ప్రగతికి ఎక్కడ అంకురార్పణ జరిగినా అందుకు మూలం గణపయ్యే..అయ్యుంటాడు అన్న విషయానికి దీనికన్నా తార్కాణం మరేముంటుంది?

Ganesh
నేత్రం తెలిపే సందేశం:
మానవుడు ప్రగతి సాధించడానికి ఏం చెయ్యాలో గణపతి రూపమే సందేశాలిస్తూంది. ఆ ఆదిదేవుని రూపాన్ని ఒక సారి చూడండి ! చిన్నపాటి కళ్ళు ఆ కళ్ళు ఇచ్చే సందేశం ఏమిటో తెలుసా? నీకు అవసరమైనదాన్ని మాత్రం చూడు. ప్రగతి సాధించ కోరే వ్యక్తి తనకేమవసరమో – తన లక్ష్య సాధనకు ఏవి అవసరమో వాటిని మాత్రమే చూడాలి.ఇది గణపతి రూపం మనకిచ్చే మొదటి సందేశం.
కర్ణం (చెవులు)  తెలిపే సందేశం:
ఇక ఆ చాటంత చెవులను చూడండి. నర మానవుల్లో ఉన్న బలహీనత ఏమంటే తనకు తోచింది వాగడం. ఎదుటివాడు ఏమంటున్నాడో కూడ అస్సలు వినక పోవడం. భగవంతుడు నోటికి పెదాలతో మూత వేసాడు. కాని చెవులకు మత్రం మూత వెయ్యలేదు. అంటే ఏమర్థం? ఎక్కువగా మాట్లాడకు ఎక్కువగా విను. ఇది గణపయ్య రూపం మనకిచ్చే రెండవ సందేశం
తొండం తెలిపే సందేశం:
ఆ తొండాన్ని చూడండి.ఎంత పొడవుగా ఉందో? ఏనుగు శ్వాస దాని తొండం ద్వారే జరుగుతుంది. దాని శ్వాస అంత పొడవుగా లోతుగా జరుగుతుంది. అందుకే దానికి అంత భలం అంతటి ఓర్పు -అంత ఆయువు. శ్వాస అంత లోతుగా జరగాలి అన్నదే గణపతి రూపం మనకిచ్చే మూడవ సందేశం.
శిరస్సు తెలిపే సందేశం:
ఇక మన చీకటి జీవితాలకు ఉషస్సును – అనామక జీవితాలకు యశస్సును ప్రసాదించగల ఆ అగ్రజుని శిరస్సును చూడండి. విన్నవాటిని తలకెంకించుకొండి. తలకెక్కించుకుని పరిశీలించండి -పరిశోదించండి. ఇది గణపతి రూపం మనకిచ్చే నాల్గవ సందేశం
ఇలా గణపయ్య రూపం మనకిచ్చే సందేశాలు ఎన్నెన్నో. నేర్చుకోవడానికి కావల్సింది నేర్పే గురువు కాదు. నేర్చుకోవాలన్న తపన. ఆ అపనే ఉంటే ఆ శివబాలుని రూపమే మనకెన్నో సూక్ష్మాలను ఉపదేశిస్తుంది.
వినాయకునికి ప్రీతికరం అంటూ గన్నేరు పూలతో మాల సమర్పిస్తాం . వెళంకాయి పెడ్తాం. గఱిక పెడతాం. ఇవన్నీ పెట్టడం వీటిని గణపతి ఆరగిస్తాడని కాదు.
మన రుషులు ఎంతో మేథావులు . ఆరోగ్య సూత్రాలను ,సూక్ష్మాలను సైతం భక్తితో మిళితం చేసేరు. గన్నేరు పువ్వు గాలిలోని సూక్షమ క్రిములను సంహరిస్తుంది. గఱిక రసం రక్తాన్ని శుభ్రం చేస్తుంది. మలినాలను వడపోస్తుంది. విషాలను విరిచేస్తుంది.
పాముతో పోట్లాడి పాము కాటుకు గురైన ముంగిస గఱిక ఉన్న చోటికి వచ్చి వాటిని కొరికి వేస్తుంది.గఱికలోని రసం భయిట పడుతుంది .వెంటనే ముంగిస గఱిక పై పడి పొర్లుతుంది. ఇలా దాని నోటిగుండా కడ్పులోకి , గాయాల ద్వార రక్తంలోకి గఱిక రసం వెళ్తుంది. ముంగిస రక్తంలో కలిసిన పాము విషాన్ని విరుస్తుంది. దాని సైజుకు అది సరిపోతుంది. మనమైతే మన సైజుకు 48 రోజులు ఒరకడుపున త్రాగాలి. ముఖ్యంగా త్రాగుడు మానాలనుకున్న వారు -మానేసిన వెంటనే ఈ ప్రక్రియను ప్రారంభిస్తే రక్తంలోని ఆల్కహాల్ శుద్ది అయ్యి ఆల్కహాల్ కోసం తపించే దుస్థితిని మార్చుకోవచ్చు.
ఇక వెళంకాయ గురించి క్లుప్తంగా చెబుతాను.ఆ రోజుల్లో చేతబడులు -వశీకరణాలు వంటివి సర్వ సాధారణం. (ఇప్పట్లో అలా చెప్పుకు తిరిగే వారిని నమ్మక్కర్లేదు. ఎందుకంటే ఇవీ కనుమరుగై పోయాయి. ఉన్నవారంతా బోగస్గాళ్ళే) తమ భర్తకు ఎవరైనా చేతబడులు -వశీకరణాలు చేసి తనకు కాకుండా చేస్తే ఆ స్త్రీలు పెద్దలను ఆశ్రయించే వారు. అప్పుడు ఆ పెద్దలు వెళంకాయ పెంకును పొడి చేసి పాలుతో కలిపి ఇవ్వమనే వారు. దీంతో ఆ పురుషుని శరీరంలో కలిసిన ఫలానా ఫలానా సరుకులన్ని మెటాష్ అయిపోతాయి. ఆ పురుషుడు పరాయి స్త్రీ మోజునుండి భయిటపడి మళ్ళీ శ్రీరాముడవుతాడు.
ప్రగతిని సాధించడం నల్లేరు మీద నడక కాదు. ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. అయినావారే కొన్ని సందర్బాల్లో తల్లి,తండ్రి,గురువులు చివరికి దేవుళ్ళు సైతం లక్ష్య సాధనకు ప్రగతికి అడ్డు పడతారు. విఘ్నాలను
ఏర్పరుస్తారు.వాటిని అధిగమించ కోరితే గణపతియే దిక్కు.అందుకే ఆయనకు విఘ్నేశ్వరుడని పేరు. ఎందరో పుట్టారు.అందరూ పోయారు.నేటికీ ఎందరో ఉన్నారు.అందరూ పోయే వారే.పుట్టడం గొప్ప కాదు. గిట్టడం నేరం కాదు.జనన మరణాల మద్య ఉన్న వ్యవధిలో ఏం సాధించామన్నదే గొప్ప.
ఏసుక్రిస్తు పుట్టాడు. కాలచక్రాన్ని రెండుగా చీల్చాడు. క్రీస్తు శకం -క్రీస్తు పూర్వమని చదువుకుంటున్నాం. అంత గొప్పవారం కాకపోయినా కన్న తల్లి తండ్రులకు ,పుట్టిన దేశానికి చేతనైంది చేసి ప్రగతి సాధించాలి. ప్రగతి సాధిస్తేనే మన జీవితానికి అర్థం పరమార్థం.
మహారాష్ఠ్రలో పుట్టిన లోకమాన్య తిలక్ స్వరాజ్యం నా జన్మ హక్కు దానిని సాధించి తీరుతానని శంఖారావం పూరించాడు. ఆ మహానాయకునికి గణపయ్యే తోడ్పడ్డాడు. అవును. ప్రజల్లో చైతన్యం తేవడానికి లోకమాన్య తిలక్ వినాయక చవితినే వాడుకున్నాడు. వాడ వాడనా గణపయ్య విగ్రహాలను నెలకొల్పాడు. స్వరాజ్య సాధనే ద్యేయంగా ఉన్న యువకులతో విగ్రహ నిమజ్ణం సందర్భంగా చారిత్రిక ఊరేగింపులు ఏర్పాటు చేసి భారతీయుల గుండెల్లో నూతనోత్తేజాన్ని నింపాడు.
జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాల గురించి ప్రస్తావిస్తారు.వాటిలో 7 గ్రహాలు రెండు ఛాయా గ్రహాలూ ఉన్నాయి. రాహు ,కేతువులు ఛాయా గ్రహాలు. ఇవి అండర్ గ్రౌండులో ఉన్న తీవ్రవాదులకన్నా -మాఫియా డాన్లకన్నా శక్తిమంతమైనవి. అందుకే రాహు కేతువులు అశుభ ఫల ధాయకంగా ఉన్న జాతకాలను సర్పదోష జాతకాలని ప్రక్కన పెడతారు. రాహు కేతువుల్లో రాహు గురించి కాస్త తేలిగ్గా ప్రస్తావించే జ్యోతిష్కులు కూడ కేతు గురించిన ప్రస్తావన రాగానే హడలెత్తి పోతారు.
కేతు జ్నానకారకుడు. మనిషికి జ్నానం ఎప్పుడు వస్తుంది? పూర్తిగా చెడినాకే . అందుకే తమిళంలో ” కేతువై పోల్ కెడుప్పవన్ ఇల్లై” అంటారు.అటువంటి కేతు ఒక జాతకంలో గాని -గోచారంలో కాని చెడి ఉంటే ఇక ఆ మనిషి జ్నాని కాక తప్పదు. అంటే పూర్తిగా చెడిపోక తప్పదన్న మాట.
అటువంటి కేతు గ్రహ ప్రభావాలను నియంత్రించగల సమర్థులు ఎవరో తెలుసా? ఇంకెవ్వరు? మన బుజ్జి గణపయ్యే. కేతువుకి గణపయ్యకు ఏమిటి సంభంధం? నిరాడంభరతకు పెట్టింది పేరు కేతు గ్రహం.మిగిలిన దేవుళ్ళ శిల్పాలను చెక్కించాలంటే ప్రతిష్ఠించాలంటే సవా లక్ష నిభందనలు ఉంటాయి. కాని గణపతి ప్రతిష్ఠించాలంటే పిడికిడి పసుపు,గందం,బంకమన్ను ఉంటే చాలు. మేటర్ ఓవర్ ! విగ్రహమే ఉన్నా ఏ చెట్టుక్రిందో పుట్ట క్రిందో పెడితే మీ పని అయిపోతుంది. ఇక ఆయన పని ఆయన చేసుకుంటాడు.

ఆయన పని ఏమిటో తెలుసా? తనను దలచి తలొగ్గిన వారి ప్రగతి పథంలోని ఆటంకాలను తొలగించడం.ఎవరైతె తల బిరుసుతో తల తిప్పుకుని పోతున్నారు వారి తల తన్నడం .విఘ్నాలను ఏర్పరచడం.ఇంకో విషయం ఏమంటే కేతు ఏకాకి.గణపయ్య కూడా ఏకాకియే .తన తల్లిలాంటి భార్య కావాలని కూర్చుండి పోయాడు. పెళ్ళి లేదు ..పెళ్ళాం లేదు. అలాగైతే ఆంజనేయస్వామి కూడ భ్రహ్మచారే కదా? ఆయన్ను పూజిస్తే కేతుగ్రహ పీడన తగ్గుతుంది కదా అని మీరు అడగొచ్చు.
హనుమన్నకైతే రామన్నతో భంధం ఉంది. అది స్వామి సేవకా భంధం.గణపయ్యకైతే ఎవరితోనూ ఏ భంధమూ లేదు. స్వయాన తండ్రి – తనను (భూత) గణాలకు అధిపతి గావించిన పరమేశ్వరుడు సైతంయుద్ద సన్నాహాల గొడవలో తనను తలవడం మరిచాడని తండ్రి రథ చక్రాలను కూల్చిన వాడు గణపతి. అందుకే కేతు గ్రహాని గణపతిని అదిదేవతగా నిర్ణయించారు మన రుషులు.
ఇక గణపతి నిమజ్న విషయానికొస్తాం. ఈ సృష్ఠికి ఒక ధర్మం ఉంది. అదేమంటే ఏది ఎక్కడ నుండి వచ్చిందో అది అక్కడికే వెళ్తుంది. జన్మించిన వారు మరణించక తప్పదు.మరణించిన వారు జన్మించకా తప్పదు. అన్నది గీతోపదేశం. ఈ నిభందన ప్రకారం మట్టి మట్టితో కలవాలి. అందుకే బంక మట్టితో చేసిన విగ్రహాలను నీటిలో నిమజ్నం చేస్తాం. మట్టి మట్టిలో కలుస్తుంది.
మనం కూడ మన శరీరాలు కూడా ఇలాగే కలిసి పోతాయి. అందుకే నిమజ్నానికి ముందే గణపతికి అన్ని పూజలు నిర్వహించినట్టే – మనం చని పోయి -ఈ సృష్ఠి లో కలిసి పోక మునుపే తల్లి తండ్రులు, గురు దైవం మాతృ భూమి పట్ల మన భాధ్యతను నిర్వహించాలన్న సందేశాన్ని గణపతి నిమజ్నం తెలియ చేస్తుంది.

మరణం తలుపులు తట్టక ముందే శారీరకంగా, మానసికంగా ,ఆర్థికంగా,సామాజికంగా ,ప్రగతిని సాధిస్తాం. ఆటంకాలను గణపతి తయతో అధిగమిస్తాం.గణపతి యొక్క భీజం “గం” “ఓం ” అన్నది ప్రణవం. ఓం గం గణపతే నమ: అంటూ జపిస్తాం.ప్రగతి కొరకు తపిస్తాం.