తిరుమలలో ఈనాడు

తిరుమలేశుని ఆలయంలో తెల్లవారు జామున మూడు గంటలకు శ్రీవారికి సుప్రభాతం సేవ జరుగుతుంది. ఉదయం ఐదున్నర గంటలకు శ్రీవారికి వీఐపీ దర్శనం మొదలవుతుంది. కేంద్రీయ విచారణ కార్యాలయ ప్రాంగణంలోని ఆర్జితం కౌంటరు ద్వారా ఉదయం ఏడు గంటల నుంచి శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించిన టిక్కెట్లను తితిదే విక్రయిస్తుంది. సుప్రభాతం, కల్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకణ సేవా టిక్కెట్లు భక్తులకు లభిస్తాయి. పొర్లుదండాల టోకెన్లను మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఉచితంగా తితిదే జారీ చేస్తుంది. నాదనీరాజనం వేదికపై సాయంత్రం ఆరు గంటల నుంచి వేణుగాన కచేరి కార్యక్రమం జరుగుతుంది. హైదరాబాదుకు చెందిన జయప్రద రామ్మూర్తి బృందం కార్యక్రమాన్ని నిర్వహించనుంది.

తిరుమల సమాచారం
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ శుక్రవారం సాధారణంగా ఉంది. ధర్మదర్శనం కోసం వైకుంఠం-2 సముదాయంలో 12 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం(శీఘ్రదర్శనం)కు రెండు గంటల సమయం తీసుకుంది. శనివారం భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉంది. మందిరంలోని స్వామి సన్నిధిలో మహాలఘు దర్శనం అమలు చేయనున్నారు.