పేలుడు పదార్థాలు స్వాధీనం

బంగారుపాళ్యం పోలీసులు శుక్రవారం పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై ఉమామహేశ్వరరావు కథనం మేరకు.. బంగారుపాళ్యం రహదారిలోని కొదలమడుగు వద్ద పోలీసులు శుక్రవారం వాహనాల తనిఖీ చేపట్టారు. తమిళనాడులోని గుడియాత్తం నుంచి బంగారుపాళ్యం వైపునకు వస్తున్న కారును అనుమానంతో తనిఖీ చేయగా 1700 మీటర్ల వొత్తి, 600 జిలెటిన్‌ స్టిక్స్‌ బయటపడ్డాయి. కారు, పేలుడుపదార్థాలతో పాటుగా తమిళనాడు రాష్ట్రం కాట్పాడికి చెందిన లోకనాధంను అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి రూ.2600 నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.