*టెంకాయ జాతర*

vlcsnap-2015-05-22-15h06m57s4

vlcsnap-2015-05-22-15h07m06s93

vlcsnap-2015-05-22-15h07m13s167

vlcsnap-2015-05-22-15h07m47s251

vlcsnap-2015-05-22-15h08m01s137

vlcsnap-2015-05-22-15h08m12s248

vlcsnap-2015-05-22-15h08m24s106*టెంకాయ జాతర*
జాతరంటే తప్పట్లు ,తాళాలు ,కోలాటాలు …కొత్త బట్టలు పిండివంటలు …పూజలు ,పునష్కారాలు.కాని చిత్తూరు జిల్లా లో మాత్రం ప్రతీ జాతరను కాస్త వెరైటీగా జరుపుకుంటారు.మొన్నటి వరకు గంగమ్మ జాతరలో నోట్లో శూలాలు గుచ్చుకుంటే …నిన్న జరిగిన కురబ జాతరలో కొబ్బరి కాయలను భక్తులు తమ తలపై పగలకొట్టుకున్నారు. ఒకటి కాదు రెండు కాదు వెయ్యిన్ని ఎనిమిది టెంకాయల ను మూడు వందల మంది భక్తులు తమ తలపై పగులకోట్టుకొని మొక్కుబడి తీర్చుకున్నారు.ఈ మాటలు వింటేనే ఒళ్ళు గగుర్ప డుతున్నా ఇది అక్షరాలా నిజం….
కొబ్బరికాయను రాయి పై కొట్టేందుకే మనం తెగ ఆయాస పడిపోతాం .కాని ఇక్కడ వీళ్ళు తలపై టెంకాయలు కొట్టించు కుంటారు .ఇక్కడే కాదు చిత్తూరు కర్ణాటకా సరిహద్దు ప్రాంతాలలో యాడాదికి ఒక్క సారి ఈ కురబ జాతర లో తల పై కొబ్బరి కాయలు పగలకోట్టించు కోవడం ఆనవాయితి. ఇక్కడ టెంకాయలు తలపై కొట్టించు కోనేవారితో కొట్టే వారు కుడా ఎగబడతారు .ఈ చిత్రాన్ని తిలకించడానికి కర్ణాటకా ,తమిళనాడు ప్రాంతాలనుంచి వేల సంక్యలో జనం చేరుకుంటారు.