Sports News

     18 పరుగులతో ముంబై పరాజయం      కింగ్స్ ఎలెవన్‌కు తొలి విజయం


18 పరుగులతో ముంబై పరాజయం
కింగ్స్ ఎలెవన్‌కు తొలి విజయం

ముంబై: ముంబై ఇండియన్స్ విజయలక్ష్యం 178 పరుగులు… ఒక దశలో 59/6. మ్యాచ్ దాదాపుగా చేజారినట్లే. అయితే ఈ దశలో హర్భజన్ సింగ్ అద్భుత ఇన్నింగ్స్ ఆ జట్టు గెలుపుపై ఆశలు పెంచింది. హర్భజన్ (24 బంతుల్లో 64; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపులకు తోడు సుచిత్ (21 బంతుల్లో 34 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అండగా నిలవడంతో ముంబై విజయానికి సమీపంగా వచ్చింది. అయితే కేవలం 6.1 ఓవర్లలోనే వచ్చిన ఈ 100 పరుగుల భాగస్వామ్యం జట్టును గెలిపించలేకపోయింది.

ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరకు పంజాబ్ 18 పరుగుల తేడాతో విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. బెయిలీ (32 బంతుల్లో 61 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేయగా, సెహ్వాగ్ (19 బంతుల్లో 36; 6 ఫోర్లు, 1 సిక్స్), విజయ్ (29 బంతుల్లో 35; 6 ఫోర్లు) రాణించారు. అనంతరం ముంబై 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులు చేసింది. టోర్నీలో పంజాబ్‌కు తొలి గెలుపు కాగా, ముంబైకి ఇది వరుసగా రెండో పరాజయం.

 స్కోరు వివరాలు
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: విజయ్ (సి) సుచిత్ (బి) హర్భజన్ 35; సెహ్వాగ్ (సి) పొలార్డ్ (బి) హర్భజన్ 36; మ్యాక్స్‌వెల్ (సి) రాయుడు (బి) సుచిత్ 6; మిల్లర్ (సి) తారే (బి) మలింగ 24; బెయిలీ (నాటౌట్) 61; రిషి ధావన్ (సి) వినయ్ (బి) మలింగ 6; జాన్సన్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 177.

 వికెట్ల పతనం: 1-60; 2-68; 3-88; 4-134; 5-150.
 బౌలింగ్: వినయ్ 4-0-46-0; సూయల్ 3-0-22-0; మలింగ 4-0-34-2; హర్భజన్ 4-0-20-2; సుచిత్ 4-0-41-1; పొలార్డ్ 1-0-11-0.

 ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (ఎల్బీ) (బి) సందీప్ 0; ఫించ్ (బి) జాన్సన్ 8; తారే (సి) విజయ్ (బి) అనురీత్ 7; రాయుడు (సి) సాహా (బి) జాన్సన్ 13; అండర్సన్ (స్టంప్డ్) సాహా (బి) పటేల్ 5; పొలార్డ్ (సి) మిల్లర్ (బి) పటేల్ 20; సుచిత్ (నాటౌట్) 34; హర్భజన్ (సి) సందీప్ (బి) అనురీత్ 64; వినయ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 159.

 వికెట్ల పతనం: 1-0; 2-15; 3-17; 4-25; 5-46; 6-59; 7-159.  బౌలింగ్: సందీప్ 4-1-12-1; అనురీత్ 4-0-41-2; జాన్సన్ 4-1-23-2; అక్షర్ 4-0-30-2; ధావన్ 4-0-50-0.