ఎవరిది ఈ వాహనం? రెండురోజులుగా వంక గట్టున.. పీలేరు

పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరం కలికిరి మార్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలోని బడబళ్లవంక గట్టున రెండు రోజులుగా హీరో హోండా ద్విచక్ర వాహనం అనుమానాస్పద స్థితిలో నిలిపి ఉంది. దానిపై ఏపీవో 3 5123 నెంబరుతో పాటు పోలీస్‌, శైలజ నారాయణ్‌ అని రాశారు. అంతర్జాలంలో పరిశీలించగా, ఆ వాహనం ఎం.రవీంద్రబాబు అనే వ్యక్తి పేరు మీదుగా తిరుపతిలో రిజిస్ట్రేషన్‌ చేసినట్లు ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం సాయంత్రం దాన్ని స్వాధీనం చేసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసులు దర్యాప్తులు అసలు వాస్తవాలు తెలియాల్సి ఉంది.