ఎమ్మెల్యే పదవికి రోజా అనర్హురాలు: బొజ్జల

అధికారులతో ఎలా మాట్లాడాలో కూడా తెలియని రోజా ఎమ్మెల్యే పదవికే అనర్హురాలని మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి విమర్శించారు. నియోజకవర్గంలో ప్రజలు కరవుతో అల్లాడుతుంటే వారి సమస్యలు పరిష్కరించాల్సిందిపోయి సమస్యలను సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. అసెంబ్లీలో కూడా అల్లర్లు సృష్టించడంలో ఆమె ఎప్పుడూ ముందుంటారని శనివారం పూతలపట్టులో విలేకరులతో పేర్కొన్నారు.