రెండ్రోజుల్లో 222 కేసులు

చిత్తూరు:రోడ్డు ప్రమాదాల నివారణకు రెండ్రోజులు నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో 222 కేసులు నమోదు చేసినట్లు చిత్తూరు ఆర్టీవో సుబ్బారావు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆరు బృందాలతో గురు, శుక్రవారాల్లో జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించినట్లు చెప్పారు. ఈ డ్రైవ్‌లో అధిక లోడుతో రవాణా చేస్తున్న వాటిపై 45, మద్యం మత్తులో వాహనాలను నడుపుతున్న వారిపై 33, లైసెన్సులు లేకుండా వాహనాలను నడుపుతున్న వారిపై 53, హెల్మెట్లు లేకుండా వాహనాలను నడుపుతున్న వారిపై 82 కేసులు, ఇతర కేసులు 104 నమోదు చేసినట్లు చెప్పారు. ఇకపై దాడులు ముమ్మరం చేసి.. నిబంధనలను అతిక్రమించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా గతంలో మద్యం మత్తులో వాహనాలను నడిపే వారిపై కేసులు నమోదు చేసి కోర్టు ముందు హాజరుపరుస్తున్నామని.. ఇకపై లైసెన్సులు లేకుండా వాహనాలు నడిపే వారిపై కూడా కేసులు నమోదు చేసి, కోర్టుకు హాజరుస్తామని చెప్పారు. ప్రజలందరూ నిబంధనలు పాటించాలని.. లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.