ఎర్రచందనం అక్రమాల లో అంతర్జాతీయ స్మగ్లర్ చెన్ హిఫన్

చిత్తూరు జిల్లా ఎస్.పి. శ్రీనివాస్ రావు నేతృత్వంలో గత కొద్ది రోజులుగా టాస్క్ ఫోర్స్ సిబ్బంది సహాయంతో ఎర్రచందనం అక్రమ రవాణా పై జరిపిన ఢిల్లీ (ఫరిదాబాద్) ఆపరేషన్ లో చిత్తూరు జిల్లా ఎస్.పి. శ్రీనివాస్ రావుకు రాబడిన సమాచారం మేరకు 28.05.2015 వ తేదీన మదనపల్లి II పట్టణ ఎస్.ఐ. మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది సహాయంతో వాహనముల తనికి చేయుచుండగా ఎర్రచందనం అంతరాష్ట్ర స్మగ్లర్ సి.శ్రీనివాసులు @ డాబా శ్రీను, 33 yrs, s/o లేట్ రామమూర్తి, చీకూరిపల్లి, కె.జి.సత్రం (పోస్ట్), బంగారుపాల్యం (మం), చిత్తూరు జిల్లా, మరియు కె.హరిబాబు, 35 yrs, s/o లేట్ కె.పురుషోత్తం చీకూరిపల్లి, కె.జి.సత్రం (పోస్ట్), బంగారుపాల్యం (మం), చిత్తూరు జిల్లా లను అరెస్టు చేసి వారి వద్ద నుండి ఒక మహీంద్ర లోగాన్ కారు మరియు 3 ఎర్రచందనం దుంగాలను స్వాధీనం చేసుకొని విచారణ చేయడమైనది. ఇంటరాగేషన్ లో అంతరాష్ట్ర స్మగ్లర్ అయిన సి.శ్రీనివాసులు @ డాబా శ్రీను ఇచ్చిన వాగ్మూలంలో అంతర్జాతీయ స్మగ్లర్ అయిన చెన్ హిఫన్ గురించి మరియు ఢిల్లీ లో అతనున్న స్థావరం గురించి తెలియవచ్చినది. ఆ విషయం తెలిసిన వెంటనే చిత్తూరు ఎస్.పి. గారు ఒక డి.ఎస్.పి. మరియు ఒక ఇన్స్పెక్టర్ ను వాయు మార్గం ద్వారా ఢిల్లీ కు పంపడం జరిగినది. చిత్తూరు జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు పహర్గంజ్ ప్రాంతం పోలీసుల సహాయ సహకారాలతో అంతర్జాతీయ స్మగ్లర్ అయిన చెన్ హిఫన్ ను 29.05.15 వ తేదీ రాత్రి 10 గంటలకు ఢిల్లీ నందు పహర్గంజ్ ప్రాంతం వద్ద గల అజయ్ గెస్ట్ హౌస్ లో అరెస్టు చేసి అతని వద్ద గల ఎర్రచందనం బొమ్మలు, మాలలు, చైనీస్ కరెన్సీ 2521 యెన్ లు మరియు హాంగ్ కాంగ్ కరెన్సీ 170 డాలర్స్ స్వాదినం చేసుకొని విచారించడమైనది. అతను ఇచ్చిన సమాచారం పై హర్యానా రాష్ట్రము లోని ఫరిదాబాద్ జిల్లా నందు గల కర్ణేరా గ్రామం లోని గోడౌన్ లో దాడులు నిర్వహించి భారీ డంప్ సుమారు 9.5 టన్నుల దుంగాలను స్వాధీనం చేసుకొవాడమైనది. ఈ ఆపరేషన్ వివరములను ఎస్.పి.గారు ఫరిదాబాద్ పోలీస్ కమిషనర్ గారికి తెలిపి తగిన సహాయ సహకారాలు తీసుకోవడం జరిగినది. 30.05.15 వ తేదీన అతనిని ఢిల్లీ నందు గల తీస్ హజరి కోర్ట్ నందు హాజరు పరిచి ట్రాన్సిట్ వారెంట్ పొంది అతనిని మరియు స్వాధీనం చేసుకొన్న దుంగాలను చిత్తూరు కు రవాణా చేయుటకు అనుమతి పొంది సదరు ముద్దాయిని 03.06.15 వ తేదీన మదనపల్లి కోర్ట్ లో హాజరుపరిచి రిమాండ్ కు తరలించడమైనది.

పై ఆపరేషన్ లో అరెస్టు కాబడిన అంతర్జాతీయ స్మగ్లర్ చెన్ హిఫన్ వివరములు ఈ క్రింద కనబర్చబడ్డవి.
1) చెన్ హిఫన్, 42 yrs, s/o చెన్, జియాన్మెన్ టౌన్, ఫుజియన్ ప్రొవిన్స్, చైనా.
 ఇతను ఎర్రచందనం రవాణాలో అంతర్జాతీయ స్మగ్లర్.
 ఇతను మెకానికల్ ఇంజినీరింగ్ నందు డిప్లొమా చేసివున్నాడు.
 ఇతని వృత్తిరీత్యా ఎలక్ట్రానిక్ వస్తువుల వ్యాపారస్తుడు.
 ఇతను 2013 సం. నుండి ఎర్రచందనం అక్రమ రవాణా వ్యాపారంలో వున్నాడు.
 ఇతనికి హాంగ్ కాంగ్ మరియు దుబాయి కి చెందిన అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ లతో మరియు ఇండియా లో తమిళనాడు, కర్నాటక, హర్యానా, ఉత్తరప్రదేశ్ మరియు ఢిల్లీ నందు గల ఎర్రచందనం స్మగ్లర్ లతో సంబంధాలు వున్నాయి.
ఆపరేషన్ లో ఉన్న అధికారులకు ప్రశంస పాత్రాలను చిత్తూరు జిల్లా SP శ్రీనివాస్ రావు అందజేశారు.
vlcsnap-2015-06-05-10h01m09s546

vlcsnap-2015-06-05-10h01m19s326

vlcsnap-2015-06-05-10h01m20s426

vlcsnap-2015-06-05-10h01m32s601

vlcsnap-2015-06-05-10h01m34s811

vlcsnap-2015-06-05-10h01m39s681

vlcsnap-2015-06-05-10h01m44s056

vlcsnap-2015-06-05-10h02m01s692

vlcsnap-2015-06-05-10h02m29s178