మీ సమస్య -పరిష్కారం ( ఉచిత జ్యోతిష సలహా)

planets
టివి చానళ్ళల్లో వీక్షకుల ప్రశ్నలకు జ్యోతిష్కులు సమాధానం చెప్పడం చూసే ఉంటారు .వారు వారి పుట్టుక వివరాలను అడిగి తెలుసుకుని సమాదానం చెబుతుంటారు .
ఏదో దేవుని దయతో నేను ఒక ప్రొఫేష్నల్  జ్యోతిష్కునిగా కొంత మెరకు బిజిగానే ఉన్నాను . బర్త్ డీటెయిల్స్ తీసుకోవడం -జాతకం వేసుకోవడం -ప్రశ్నలకు సమాదానం చెప్పడం కష్ఠ సాధ్యమే ( మేటర్ ఆఫ్ టైమ్)
కాబట్టే ఈ ఆఫర్ ఇస్తున్నాను .జస్ట్ మీరు మీ సమస్య చెబితే చాలు . అతి సుళువైన -లాజికల్ రెమిడీస్ మీకు అందిస్తాను .ఈ విషయమై మీకు రెండు అంశాలను చెప్పాల్సి ఉంది.
1.ఒక జాతకం తీసుకుని – సమస్యాత్మకంగా ఉండే గ్రహాన్ని కనుగొని ఆ గ్రహం మీకివ్వకలిగే సమస్యలను చెప్పడం సాధ్యమైతే – మీ సమస్యను పట్టి -సమస్యకు కారకమైన గ్రహాన్ని కనుగొని -పరిష్కారం చెప్పడం కూడ సాధ్యమేగా?
2.సాధారణంగా జ్యోతిష్కులు చెప్పే పరిహారం అంటే గుళ్ళూ తిరగడం -దీపాలు వెలిగించడం -శ్లోకాలు చదవడం వంటివే అయ్యుంటాయి. కాని నా అనుభవంలో అవేమి పెద్దగా ఫలితాన్ని ఇవ్వడం లేదు .( గుళ్ళ కథ ఏమో కాని దేవుళ్ళ కథ నాకు కొంతమెరకు తెలుసు – ఆత్మ శుద్దితో దలచి -ప్రార్థించే వారే కరువై దేవుళ్ళందరు ఖాళిగా గోళ్ళు గిల్లుకుంటూ –  ఈగలు త్రోలుకుంటున్నారు . ) సమస్య ఏక్కడ వస్తుందంటే మన మనస్సు లగ్నం కావడం -విశ్వాసం -నిబ్బరం ఇవి లోపించినప్పుడు పూజలు పునస్కారాలు పారవు కదా?
అందుకే నేనిచ్చే పరిహారాలు కొంత వైవిద్యంగా ఉంటాయి.వీటి ఉద్దేశం సతరు గ్రహం ఇవ్వవలసిన దుష్ఫలితాన్ని మనమే వాలంటియర్గా జరిపించుకోవడం.( అంటే కుజగ్రహం = ప్రమాదం/అగ్ని ప్రమాదం ఇవ్వనున్నప్పుడు మనకు మనమే రక్త దానం చేసి రావడం) దుష్ఫలితాలను జరిపించుకోవడంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తాను .మీ కుటుంభ,వైవాహిక,సామాజిక,ఆర్థిక విషయాలు దెబ్బతినకుండా ఉండేలా ప్లాన్ చేసి చెబుతాను.
ఇలా ముందుగా – గ్రహ ప్రభావాన్ని ఎదుర్కోవడానికి ముందుకొస్తే  మనం ఎంపిక చేసుకున్న విషయాల్లో మాత్రం  సతరు గ్రహం ఎఫెక్ట్ అయ్యేలా చూడొచ్చు .లేదంటే అది ఎడా-పెడా, ఎఫెక్ట్ ఇచ్చి బతుకును పాత  బస్ స్టాండు చేస్తుంది.
ఓకె. కాన్సెప్ట్ అర్థమైంది కదా?
ఇక మీరు చెయ్యాల్సిందెల్లా మీ వయస్సు, మీ సమస్యను మాత్రం తెలపడమే . మీ పేరు /పుట్టుకవివరాలు , నక్షత్రం/రాశి/లగ్నం ఏది అవసరంలేదు . మొదలెడదామా?
గమనిక:
అయితే సమస్యను వ్రాస్తున్నప్పడు కొంత మెరకు వివరాలు ఇస్తే మంచిది . పిల్లలు లేరు అని మాత్రం చెప్పకుండా అస్సలు గర్భం దాల్చడం లేదు/ మిస్ కేరి అయి పోతుంది ఇలా.