పోలీసుల ప్రవర్తన దారుణం..

ఆర్టీసీ బస్టాండుల్లో దుకాణదారులతో పోలీసుల ప్రవర్తన దారుణంగా ఉందని నిర్వాహకులు డీసీటీఎం కృష్ణరావు, డిపో మేనేజరు గజలక్ష్మి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ రాత్రి పది గంటలు దాటితే పోలీసులు తనిఖీలు, విధుల పేరుతో నానా దూర్భాషలాడుతూ.. దుకాణాలు మూసేయాలంటూ.. పనివాళ్లు, నిర్వాహకులపై చేయి చేసుకుంటున్నారని కన్నీటిపర్యంతమయ్యారు. ప్రయాణికులు రాత్రి సమయాల్లో బస్టాండులో ఉండటానికి ఇబ్బందులు పడుతున్నారని విన్నవించారు. స్పందించిన అధికారులు మాట్లాడుతూ జిల్లా పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారిస్తామని, సమయపాలన ఉత్తర్వుల్ని అధికారికంగా అందిస్తామని హామీ ఇచ్చారు.09lead4