కొత్త సం.లోనైనా కొత్తగా ఆలోచిద్దాం !

కొత్త సం. వచ్చింది.పంచాంగాలు చెప్పించుకుని ,టివిచానళ్ళల్లో రాశి ఫలాలు చూసుకుని సం.లోని
మొదటి రోజే లీవో /పెర్మిషనో వేసి గుళ్ళకెళ్ళి అలా కానిచ్చేసాం. మందుబాబుల కథ వేరే చెప్పక్కర్లేదు .
పండుగ పూటా పాత మొగుడే అన్నట్లుగా ముందు రోజు రాత్రి అదే బ్రాండు త్రాగి సూరీడు నడి నెత్తి
మీదికి వచ్చాక మద్యాహ్నం మందుకోసం సెక్ట్చ్ వేస్తూ గడిపి ఉంటారు.
ప్రయోజకులు ,సగటు మనుషులు ఇలా తేడా లేకుండా ప్రతి ఒకరు మైక్రో లెవల్లో ఆలోచించడం
మినహా మేక్రో లెవల్లో ఆలోచించే ప్రసక్తే లేదు.
మనోళ్ళు ఇలా పొరుగింటి వాడు ,పక్క సీటు పద్మనాభం,మించి పోతే ఫారీన్లో ఉన్న బావుమర్ది గురించి తప్ప మరేదీ ఆలోచించక పోవడమే మన పాలకులకు కావల్సింది.
మనోళ్ళూ కూడ సరిగ్గా ఇలానే తయారయ్యేరు .
మన దేశాన్ని ఒక రైలుకు పోలుస్తే మనమందరం అందులో ప్రయాణికులమే. దేశం రైలైతే రాష్ఠ్రాలను కోచ్ అనొచ్చేమో? జిల్లాలను ?
అయితే మనం ఒక పరిదిని దాటి ఆలోచించం.
తెలంగాణ వెనుకబడిందా? వెంటనే రాష్ఠ్రం కోరుకుంటారు . పొరభాటుగా వారిది మిగులు బడ్జెట్ కాబట్టి ఇప్పట్లో వచ్చిన చిక్కేమి లేదు (ముందు ముందుంది ముసళ్ళ పండుగ)
మనం ఆలోచించాల్సింది ..దేశమనే రైలు ఎటు నుండి ఎటు వెళ్తుంది? ప్రస్తుతం ఎక్కడున్నాం? మన పయణం ఎటు? వీటి గురించి అసల్ ఆలోచించం.
షేర్ మార్కెట్ మీద ఆసక్తి గలవారే నయం కొంతలో కొంత ప్రపంచ /ఆసియా/భారత స్థితిగతులను కొంతమెర అంచనా వేస్తుంటారు .(తమ షేర్ విలువ పెరుగుతుందేమో తెలుసుకోవడానికి)
ప్రభుత్వ ఉధ్యోగులైతే అస్తమానం టి.ఏ లు డి.ఏలు పాత చింతకాయ పచ్చడి -చాలా మంది మ్యామ్యాల లెక్కల్లో బిజిగా ఉంటారు .
ఇలా ఎవరూ ఆలోచించక పోవడంతో నేను వీ(మీ) రందరి తరపున ఆలోచించడం మొదలు పెట్టాను . నా చిట్టి బుర్రకు సమస్యల మూలాలు దర్శనమిచ్చాయి-వాటికి కొన్ని పరిష్కారాలను వెతకడం కూడ చేసాను .వాటిని ఏకంగా ప్రధాని కార్యాలయానికే చేరవేశాను .
మన దేశానికున్న అసలైన సమస్యలేవి? వాటికి ఉన్న పరిష్కారాలేవి ? ఈ టపాలో వివరించ దలచాను .ఇప్పటికీ ఈ పేజిని మూ

సెయ్యలేదంటే మీకు కొంత ఓపిక-ఆలోచన ఉన్నట్టే.
నేను చెప్పాలనుకున్న సంగతులన్నింటిని ఒక కరపత్రంగా ముద్రించి అందరికి అందచేస్తున్నాను .కర పత్రంయొక్క స్కాన్ కాపి ఇక్కడ ఇస్తున్నాను .చదవండి ..
మీ అభిప్రాయాలు/విమర్శలు తెలియ చేస్తే సంతోషిస్తాను ..

 

A3

A3 Tel 2