వ్యక్తిగత మరుగుదొడ్లతో ఆరోగ్యం

ప్రతిఒక్కరూ వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకుంటే ఆరోగ్యంగా ఉంటారని ఎంపీడీవో రామచంద్ర అన్నారు. ఆయన శుక్రవారం మండలంలోని జిల్లేళ్లమంద, వడ్లకుంట గ్రామాల్లో పర్యటించి మరుగుదొడ్ల నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం ఆయన లబ్ధిదారులతో మాట్లాడుతూ నిర్మాణ పనులు వేగం చేయాలని, బిల్లులు రెండు విడతలుగా చెల్లిస్తామని చెప్పారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి సుబ్రహ్మణ్యంరెడ్డి ఉన్నారు.