నవోదయలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
మదనపల్లె స్థానిక నవోదయ విద్యాలయంలో తొమ్మిదో తరగతిలో ఖాళీగా ఉన్న సీట్లకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రధానాచార్యులు బాలసుబ్రహ్మణ్యం శుక్రవారం తెలిపారు. 2015-16 విద్యాసంవత్సరానికి ఎస్సీలకు 3, ఎస్టీలకు 1, మిగిలిన కులాల అభ్యర్థులకు 2 సీట్లు ఖాళీగా ఉన్నట్లు చెప్పారు. అభ్యర్థులు 2014-15 సంవత్సరంలో చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ, ప్రభుత్వం గుర్తింపు పొందిన పాఠశాలల్లో 8వ తరగతి చదువుతుండాలని పేర్కొన్నారు. ఈనెల 11వ తేదీ నుంచి నవోదయ విద్యాలయంలో గానీ, జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలోగానీ, నవోదయ వెబ్‌సైట్‌లోగానీ దరఖాస్తు పత్రాలు పొందవచ్చని వెల్లడించారు. పూర్తి చేసిన దరఖాస్తు పత్రాలను మే 15లోపు నేరుగా గాని, రిజిస్టర్‌ పోస్టు ద్వారా నవోదయ విద్యాలయానికి పంపాలని సూచించారు. అభ్యర్థులకు జూన్‌ 7న ప్రవేశ పరీక్ష ఉంటుందని చెప్పారు. మరిన్ని వివరాలకు 08571 230631 ఫోన్‌నంబరును సంప్రదించాలని ఆయన కోరారు.

News Reporter