అర్ధగిరి ఆలయం స్పెషల్

అర్ధగిరి ఆలయం స్పెషల్
ఇక్కడి పుష్కరిణిలో జలాన్ని తాగి ….మట్టిని ఒలంతా పూసుకుంటే రోగాలు న్యామోతా యి…! పౌర్నమిరోజున ఇక్కడి ఆలయంలో నిద్ర చేస్తే శాకిని ,డాకిని వంటి గాలి దెయ్యాలు పారిపోతయన్నది భక్తుల విశ్వాసం…
ఇదీ చిత్తూరు జిల్లా అరగొండ అర్ధగిరి అభయ ఆంజనేయ స్వామ్మి కథ….
చిత్తూరు జిల్లా అర్ధగిరి అభయ ఆంజనేయ స్వామ్మి కి ఓ ప్రత్యేకత ఉంది .ఇక్కడ వెలసిన ఆంజనేయ స్వామ్మి భక్తుల బలహీనతలను దూరం చేసి ఆయురారోగ్యలను చేకూరుస్తాడని భక్తుల విశ్వాసం. చర్మవ్యాదులు నయం కావాలంటే ఆలయప్రాంగణం లోని మట్టిని ఒంటికి రాసుకుంటే ఇట్టే నయమవుతుందనీ,ఆలయ ప్రాంగణం లో ఉన్న పుష్కరిణి లో జలం సేవిస్తే శరీరంలో ఉన్న అంతర్గత వ్యాదులు మానసిక రుగ్మతలు తొలగి పోతాయి.భూత ప్రేతాలు ఉన్న వారు పౌర్ణమి రోజున ఇక్కడ నిద్ర చేస్తే అభయ ఆంజనేయ స్వామ్మి వాటిని తరిమి కొడతారని ప్రగాఢ విశ్వాసం …
ఆలయ చరిత్ర ,పూర్వికులు చెప్పే విషయాలను గమనిస్తే రోగాలను నయం చేసే గుణం ఇక్కడి మట్టికి,నీళ్ళ కూ ఉందని నమ్మక తప్పదు …….