ఆధార్ కార్డులోని తప్పులను ఇలా సరిచేసుకోండి

ఆధార్ కార్డులోని తప్పులుంటే ఇప్పుడు చింతిచాల్సిన పనిలేదు. నచ్చిన ఇంటర్నెట్ సెంటర్ కు వెళ్లి మీకు నచ్చిన విధంగా మార్పులు చేసుకో వచ్చు. కాని అన్ని మార్పులకు ఆధారాలు వెబ్సైటు నందు ఉంచాలి. ఇంకెందుకు ఆలస్యం. ఆధార్ కార్డులోని తప్పులను ఆన్లైన్ లో సరి చేద్దామ.

సూచనలు

1 ఆధార్ వెబ్సైటు http://uidai.gov.in/update-your-aadhaar-data.html కు(ఇక్కడ నొక్కి) వెళ్ళండి

aadhar1

2. కనిపించిన సూచనలు చదవండి, ఎలా సవరణలు చేయాలో తెలుస్తుంది

3. తర్వాత Update, Correction Request Please అనే ఆప్షన్ మీద నొక్కండి.

4. మీ యొక్క అధార్ నెంబర్ ఎంటర్ చేయండి

5. వచ్చిన వెరిఫికేషన్ కోడ్ ను నమోదు చేయండి. మీ మొబైల్ కు వచ్చిన వన్ టైం పాస్వర్డ్ ఎంటర్ చేయండి.

6. సంబందిత ఫారంలో వివరాలు నమోదు చేయండి.

aadhar2

7. ఫారం పూర్తి చేసి సబ్మిట్ చేసి, అప్డేట్ రిక్వెస్ట్ ను క్లిక్ చెయ్యాలి.

8. తర్వాత డాక్యుమెంటేషన్ లో , మీరు మార్పు కోరిన వాటి పత్రాలను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.

9. మీకు దగ్గరలోని, అందుబాటులో వున్న సర్వీస్ ప్రొవైడర్ను సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేయాలి

10. మీ యొక్క అప్డేట్ కు సంబంధించి మీకు ఒక నెంబర్ కనిపిస్తుంది. ఈ నెంబర్ ద్వారా మీరు ప్రస్తుత అదార్ ప్రస్తుత పరిస్తితి తెలుసుకోండి.

11. మీరు పోస్ట్ ద్వారా పంపించుటకు క్రింది డాకుమెంట్స్ ను డౌన్లోడ్ చేసుకోండి

అ) అప్లికేషను ఫారం

ఆ) సూచనలు