ప్రావిడెంట్ ఫండ్ నిల్వ చూసుకోవడం ఎలా??

zppfఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న జిల్లా పరిషత్ ప్రావిడెంట్ ఫండ్ (ZPPF) 2013-14 సంవత్సరానికి గాను www.zpgpf.ap.nic.in అనే కొత్త వెబ్ సైట్ నందు ఉంచడం జరిగింది. కాబట్టి zppf నందు ఖాతాదారులు అందరూ 2013-14 సంవత్సరానికి గాను కొత్త వెబ్  సైట్ నందు మాత్రమే చూసుకోవసినడిగా జిల్లా పరిషత్ సీ.ఈ.ఓ శ్రీ వేణుగోపాల రెడ్డి గారు తెలియజేశారు.

zppf చూసుకొన వలసిన విదానం

ముందుగా వెబ్ బ్రౌసర్ నందు www.zpgpf.ap.nic.in  ఎంటర్ చేయాలి. తరువాత మీకు క్రింది స్క్రీన్ కనిపిస్తుంది.

pf1

 

 

 

 

 

పై స్క్రీన్ నందు జిల్లా పేరు సెలెక్ట్ చేసుకుని, pf నంబరు ఎంటర్ చేయాలి. password దగ్గర emp తరువాత pf నంబర్ ఎంటర్ చేయాలి. ఉదాహరణకు మీ pf నంబర్ 12345 అయితే పాస్ వర్డ్ emp12345 అవుతుంది.

అన్నీ సరిగా ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తరువాత మీకు తరువాతి స్క్రీన్ ఈ క్రింది విధంగా కనబడుతుంది.

pf2

 

 

 

 

 

దానియందు menu పై కర్సర్ ఉంచిన ledger cards దానియందు 2013-14 పై క్లిక్ చేయాలి. అపుడు మీ ఖాతా తెరువ బడుతుంది.

pf3

 

 

 

 

అన్నీ సరి చూసుకుని ఏవైనా లోపాలు ఉన్నట్లయితే జిల్లా పరిషత్ ఆఫీసు నందు సంప్రదించగలరు.

ఒక వేళ మీ pf నంబరు కొత్త వెబ్ సైట్ నందు కనబడక పోయినట్లయితే మీ వివరాలు www.deochittoor.org/pf/default.aspx నందు నమోదు చేయాలి.