Happy Childrens Day

విద్యార్థులమైన మా వికాసాన్ని దెబ్బతిస్తున్నాయి కొన్ని సమస్యలు

తల్లిదండ్రులు స్వేచ్చగా ఆలోచన చేయాలి వీటికి పరిష్కార మార్గాలు

 

 1. తిట్టకుండా, కొట్టకుండా శాంతంగా చెప్పి, మా పొరపాట్లు మేముగా తెలుసుకొని మార్పు చెందేలా తగినంత వ్యవది ఇవ్వాలి.
 2. నెలకి ఒకసారయినా ప్రార్థనా స్థలాలు, సినిమా థియేటర్, పార్కు, ఆశ్రమాలకు తీసుకువెళ్ళాలి.
 3. ఎక్కవసేపు చాడువుకోమనే మీరు రొజూ కొంతసేపు ఆదుకోమని చెప్పాలి.
 4. ట్యూషన్ల అవసరం లేకుండా ఇంట్లో చదువుకొనే వాతావరణం కలిపించాలి.
 5. TV, రేడియో, కంప్యూటర్స్ కు కొంచెం సమయం ఉపయోగించుకోనివ్వాలి.
 6. తక్కువ మార్కులు తెస్తే మరికొన్ని మార్కులు తెచ్చుకోవాలని చెప్పాలి. అంతేకాని బాగా మార్కులు వచ్చే వారితో పోల్చకూడదు.
 7. తల్లిదండ్రులు రోజులో కొంచెంసేపు మాతో గడిపే వీలు చూసుకోవాలి. స్కూల్లోని విషయాలు, చదువు సాగే విదానాలు తెలుసుకోవాలి.
 8. కొన్ని సబ్జెక్టులో మార్కులు బాగా తెచ్చినపుడు మెచ్చుకోవాలి. మిగిలిన వాటిల్లో కూడా రాణించగల శక్తి మాకుందని ప్రోత్సహించాలి.
 9. మా అమ్మ TV సీరియల్స్ చూడడాన్ని తగ్గించి మంచి పుస్తకాలు చదవాలి. మా నాన్న చెడు అలవాట్లు మాని (ఉన్నట్లైతే) ఇంటికి తొందరగా రావాలి.
 10. రేయింబవళ్ళు మా గురించే దిగులు చెందే మీరు మీ ఆరోగ్య సమస్యలు, ఇతర కుటుంబ సబ్యుల అవసరాల్ని తీర్చుకోవాలి.
 11. అమ్మ, నాన్నలు దేబ్బలడుకోకుండా, వాదులాడుకోకుండా స్నేహితుల్లా ఉండాలి.
 12. ఆకర్షణలకు,ప్రలోభాలకి లోనై మేమేదైనా తప్పు చేసినపుడు ఆలస్యం చేయక వెంటనే తగినంత శిక్ష(ణ) కల్పించి దారిలో పెట్టాలి
 13. అలసినపుడు పడుకోనివ్వలి .ఎక్కువ సేపు చాడుకోవాల్సి వస్తే ఆనుకొనే ఏర్పాటుండాలి .చదువు కి భంగం కలిగించే V. మరియు PHONE ఉబూసుపోక కబూర్లు దూరంగా ఉండాలి .
 14. ఎల్లపుడు తమ మాట వినాలని కోరే తల్లిదండ్రులు మా మాటకూడావినాలి.మా సమస్యల్ని చెప్పనివ్వాలి.
 15. చదువు లోనే కాదు జీవితంలో కూడా నేగ్గకు రాగలిగే ఆత్మవిశ్వాసాన్ని కలిగించేలా మీ విధానాలుండాలి .
 16. ప్రేమతో మాకు సమకూర్చే తినుబండారాలను , వస్తువులను సహా విద్యార్తులతో పంచుకొనేలా , తద్వారా కలిగే ఆనందాన్ని మేము పొందేలా చూడాలి .
 17. అప్పు డప్పుడు మొండిగా వ్యవహరించే మా వైఖరులను పసిగట్టి , అవి తొలగి పోయేలా చేయు సాధనా సంపద ఏమిటో మీరు తెలుసు కొని మాకు అందివ్వాలి .
 18. “స్వేచ్చను కోల్పోవడమే నిజమైన స్వేచ్చను పొందడానికి అసలయిన మార్గము “ అని తెలియజేసే మన సంస్కృతి. సంప్రదాయాల పరమర్దాన్ని మీరు యెరిగి మేమూ గ్రహించేలా చేయాలి.

 ఇట్లు

మీ కుమారుడు\కుమార్తె

 

బాలల దినోత్సవం సందర్బంగా అందించిన వారు

SURESH