గురు పూజోత్సవం

sirగురుపూజోత్సవ శుభాకాంక్షలు…

గురుబ్రహ్మ..

గురుర్విష్ణు ,

గురుర్దేవో మహేశ్వరః

గురు సాక్షాత్ పరః బ్రహ్మ .. తస్మై శ్రీ గురవేనమః

గు అనగా చీకటి రు అనగా తొలగించుట. అనగా అజ్ఞానమనే అంధకారాన్ని పారద్రోలి విజ్ఞానమనే వెలుగును పంచేవాడే గురువు. మన సమాజంలో గురువుకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. విజ్ఞానాన్ని పంచేవాడు గురువు. గురువు జ్యోతి వంటివాడు. జ్యోతి తనంతట తాను వెలుగుతూ ఇతరులకు దారి చూపుతుంది. గురువు దార్శనికుడు. తన విద్యార్థులకు సరియైన మార్గదర్శనం చేస్తూ సరియైన దారిలో నడుపుతూ వారు విజ్ఞానాన్ని సముపార్జించ డానికి వారధి గా ఉపయోగ పడేవాడే ఉపాధ్యాయుడు.

అట్టి ఉపాధ్యాయుని ప్రతి సంవత్సరం సెప్టెంబరు 5 న డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టిన రోజు జరుపుకోవడం ముదావహం. ఆయన అంతటి ఉత్తమోత్తమ ఉపాధ్యాయుడు కనుకనే అతని విద్యార్థులు అతనిని అంతగా అభిమానించేవారు. సాధారణ ఉపాధ్యాయుడు గా ఉండి భారత అత్యున్నత పదవి అలంకరించి ఆ పదవికే అలంకారమైనాడు.

అటువంటి గురుపూజోత్సవం రోజున మన గురువులను తలచు కుందాం. అలనాటి మన గురువుల వల్లనే మనం ఈ రోజు ఈ స్థాయి కి వచ్చామన్న విషయాన్ని మరచి పోకుండా మన తరువాత తరాలకు కూడా గురువు యొక్క గొప్ప దానాన్ని చాటుదాం.

అందరికీ గురు పూజోత్సవ శుభాకాంక్షలు…