గోడలకు చెవులుంటాయ్

గోడలకు చెవులుంటాయ్.! ఇది పాత మాట. గోడలకు  కళ్లుంటాయ్..! ఇది నేటి బాట. ఆ కళ్లలో కొన్నింటికి మనకు కనిపించని ఆకళ్లుంటాయి.. జాగ్రత్త !! ఒళ్లంతా చెవులు చేసుకుని వినండి. ఒళ్లంతా కళ్లు చేసుకుని చూసే కెమెరాలు మన చుట్టూ ఉండొచ్చు.

ఆవిడొకప్పుడు నటి, ఇప్పుడు పొలిటీషియన్ పైగా మంత్రి కూడా. అడుగడుగునా ఆమెను  ‘రక్షణ’ చుట్టుముట్టి ఉంటుంది. ఆ భరోసాతో నేను భద్రంగా ఉన్నాను అని ఆమె కళ్లు మూసుకుని ఉంటే ఈ రోజు దేశం ఇలా కెమెరాలు తడుముకుని ఉండేది కాదు. ఆ కెమెరా కళ్లు బంధించిన దృశ్యాలు మరో రకమైన సంచలనమై దేశం సిగ్గుతో చితికిపోయేది. కాని, ఆమె కేవలం మరో సాధారణ మహిళ కాదు. ఆమె సాధికారతకు సరికొత్త చిరునామా స్మృతి ఇరానీ. నిశితమైన ఆమె కంటి చూపునకు ఆ కెమెరా కన్ను చిక్కింది. మీడియాకు మరో సంచలన వార్త దొరికింది. ట్రయల్ రూమ్‌లోకి తొంగి చూసిన ఆ కెమెరా ఎన్నో విషయాలను ఆలోచించమంటోంది. …Read more…