ఘర్షణపై కేసు నమోదు

మండల పరిధి నూతనకాలవ పంచాయతీ కొత్తవడ్డిపల్లెకు చెందిన సుమిత్ర, భర్త ఆంజనేయులుపై అదే గ్రామానికి చెందిన రాఘవులు, మరో ఐదుగురు వ్యక్తులు దాడి చేసిన ఘటనపై కేసు నమోదైంది. ఈ సంఘటన గురువారం రాత్రి జరిగింది. రాఘవులు పొలం విషయమై ఆంజేయులుతో ఘర్షణకు దిగి కట్టెలతో కొట్టి గాయపరిచారు. సుమిత్ర ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ మునిరత్నం తెలిపారు.