రైతు రుణమాఫీని సద్వినియోగం చేసుకోండి

రుణమాఫీ కొరకు రైతులు అన్ని ధ్రువ పత్రాలను నిర్ణీత సమయం లోపల అందజేయాలని, తద్వారా ప్రభుత్యం ప్రకటించిన రుణమాఫీని సద్వినియోగం చేసుకోవాలని బ్యాంకు మేనేజర్లు తెలిపారు. చాల మంది రైతులు బ్యాంకుల చుట్టూ రుణమాఫీ కోసం తిరుగుతున్నారు. అయితే వారు సరి అయిన ధ్రువ పత్రాలు లేకుండా బ్యాంకునకు వస్తున్నారు. ఈ నేపద్యంలో బ్యాంకు అధికారులు రైతుల కొరకు కొన్ని సూచనలు అందజేశారు. బ్యాంకు ఖాతా మొదటి పేజి నకలు, బంగారు రుణాలకు సంబంధించిన స్లిప్లు, ఆధార్కార్డు, రేషన్ కార్డు, సెల్ఫోన్ నెంబర్, టెన్వన్ అడంగల్, కులద్రువీకరణ పత్రం రెండు రోజుల్లో అంధ జేయాలని సూచించారు. కేవలం డిసెంబర్ 31, 2013 రుణాలకు మాత్రమే రుణ మాపి వర్తిస్తుందని తెలిపారు. వారు మాత్రమె పై దృవీకరణ పత్రాలు అందజేయాలని పేర్కొన్నారు.

ఈ నేపధ్యంలో జిల్లాలోని ప్రతిరైతు పట్టాదారు పాసుపుస్తకంతో ఆదార్ సంఖ్యను అనుసంధానం చేయాలని రాష్ట్ర ప్రభుత్యం జిల్లా రెవిన్యూ అధికారులను ఆదేశించింది. రాష్ట్ర పభుత్యం పట్టాపాసు పుస్తకాల అనుసంధాన కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈ ప్రక్రీయను సెప్టెంబర్ 15 కల్ల పూర్తి చేయాలనీఆదేశించింది. కొత్తగా పట్టా పాసు పుస్తకాలు దరఖాస్తు చేసుకొనే వాళ్ళకు ఈ-పాసు పుస్తకాలు ఇప్పించే ఏర్పాటు చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించింది. బూముల వివరాలు మార్పు కోసం 1 నుండి 15 కాలములు సవరణ చేసుకోవడానికి ప్రభుత్యం అవకాశం కల్పించింది. ఈ భూములకు సంబందిచి ఖచ్చితమైన వివరాలు వెబ్సైటు నందు నమోదు చేయాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేసారు.