ఏనుగుల దాడి…….

రామకుప్పంలో పంటలపై ఏనుగుల దాడి…….

elephant-family-hluhluwe

చిత్తూరు జిల్లా: చిత్తూరు జిల్లాలో గజరాజుల బీభత్సం రోజురోజుకీ పెరిగిపోతోంది. తాజాగా శనివారం తెల్లవారుజామున జిల్లా పరిధిలోని రామకుప్పం మండలంలోని రామాపురం తండాలో బీభత్సం సృష్టించాయి. ఏనుగులు జరిపిన ఈ దాడిలో టమోట, బీన్స్, వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. రైతులు అటవీ సిబ్బందికి సమాచారం అందించగా వారు వచ్చి ఏనుగులను అడవిలోకి తరలించారు. బాధిత రైతులు పంట నష్టం చెల్లించాలని కోరుతున్నారు. అటవీ అధికారులు ఏనుగుల బారినుంచి పంటలను రక్షించాలని రైతులు కోరుతున్నారు.