రోడ్డుకు అడ్డంగా గోడ -దిమ్మె-అంబేద్కర్ విగ్రహం

అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి రోడ్డును ఆక్రమించిన పారిశ్రామిక వేత్త
పోరు భాట పట్టిన దళిత యువత

Exif_JPEG_420

Exif_JPEG_420

Exif_JPEG_420

Exif_JPEG_420

చిత్తూరు (జన 29) స్థానిక మురగానిపాల్లె రోడ్ ,కామేశ్వరి నగర్లో మైదా ఫేక్టరికి వెళ్ళే 23 అడుగుల రోడ్డు ను పారిశ్రామిక వేత్త ఆర్.లోకనాథం నాయుడు ఆక్రమించేసారు

.ఊరికే ఆక్రమిస్తే -అడ్డంగా గోడ కడితే ఆక్రమణల తొలగింపు ఇట్టే జరిగి పోతుందేమోనని స్కెట్చ్ వేసి అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించేసేరు. దీనిని వ్యతిరేకిస్తూ స్థానిక దళిత యువ నేత టి.కాంతారావు తన మిత్రులతో కలిసి దీక్ష పూనేరు. ఇప్పటికే అడ్డు గోడను తొలగించిన వీరు అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించి గౌరవ ప్రదమైన కూడలిలో ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు .
రాత్రితో రాత్రి గోడ నిర్మించి -విగ్రహ ప్రతిష్ఠ చేసిన లోక నాథం నాయుడు ఆగడాలు ఒక ఎత్తైతే -సతరు విగ్రహాన్ని ఆవిష్కరించిన దళిత నేత రంగం పల్లె మునస్వామి దళిత జాతికి చేసిన ద్రోహం మరి ధారుణమని ప్రతి ఒకరు దీన్ని ఖండించాలని టి.కాంతారావు అన్నారు . ఈ కార్యక్రమంలో చెంగల్రాయ మిట్ట ,ఐదవ డివిజన్కు చెందిన వెంకటేష్,కే.మోహన్,మణి ,సంపత్ తదితరులు పాల్గొన్నారు .