ఉద్యోగుల బదిలీలు, బారిస్థాయిలో పైరవీలు

జిల్లాలో వివిధశాఖలలో పని చేస్తున్న ఉద్యోగుల బదిలీల పర్వానికితెరలేచింది. అధికారులు, ఉద్యోగులు నాయకులను ప్రసన్నం చేసుకొనే పనిలో పడ్డారు. కీలకమైన స్థానాల్లో తమకు అనుకూలమైన వారిని నియమించు కోవడానికి అధికార పార్టి నాయకులు ప్రయత్నిస్తునారు. ఇటీవలే ఆర్థికశాఖ విడుదల చేసిన GO 175 ప్రకారం సెప్టెంబర్ ప్రకారం సెప్టెంబర్ 30 లోపు బదిలీల పర్వం పూర్తి కావలసింది. మూడేళ్ళు పూర్తి అయిన ఉద్యోగులు తప్పనిసరిగా బదిలీ కావలసివుంది. సంవత్సరాల తరబడి ఒకే ఆఫీల్లో పేరుకు పోయిన వారికి గుబులు మొదలైంది. కేవలం మినిస్టీరియల్ సిబ్బందికి మాత్రమె కోరుకొన్న చోటికి బదిలీ అవకాశం వుంది, మిగిలిన గజిటెడ్ స్థాయి ఉద్యోగులు జిల్లాలో నాయకులకు ఇష్టం వచ్చిన చోటుకు బదిలీచేసే అవకాశం వుంది. ముఖ్యంగా కుప్పం లాంటి సుదూర ప్రాంతాలకు ఎక్కడ బలీలు చేస్తారేమో అని ఉద్యోగా వర్గాల్లో చర్చ, కలవరం మొదలైనది.

ముఖ్యంగా జిల్లా పరిషద్ ఆఫీసులో ఏళ్లతరబడి పాతుకు పోయిన ఉద్యోగులకు స్టాన చలనం తప్పదనిపిస్తుంది. గత ప్రభుత్య హయాంలో కుర్చీలో వదలని వాళ్ళు ఈ సారి దూరప్రాంత ఆఫీసులకు బదిలీ కావాల్సిందే. ఇందుకు GO 176 ఉత్తర్వులు ఊతం ఇస్తుంది. జిల్లా పరిషద్ శాఖలో మొత్తం గా 745 మందిలో 647 మినిస్టీరియల్, 65 మంది యం.పి.డి.ఓ లు, 33 సూపరింటెండెంట్లు ప్రస్తుతం పనిచేస్తున్నారు. వీరి బదిలీల నేపద్యంలో పిల్లల చదువెల గురించి అందోళలనలు పడుతున్నారు.

ముఖ్యంగా జిల్లా కేంద్రంలోనే గత హయంలో నాయకుల అండతో చక్రం తిప్పిన ఉద్యోగులకు ఈ బదిలీల విషయం మింగుడు పడలేదు. జిల్లా కేంద్రంలోనే జెడ్పి, ఆర్.డబ్లు.ఎస్ మరో రెండు శాఖల్లోనే జిల్లా కేంద్రాన్ని వదలకుండా పనిచేసేవారు మూటముల్లు సర్డుకోవాల్సిందే. రాజకీయ నాయకులు ముందుక్గా ఈలాంటి వాళ్ళనే కదిలించాలనే ఆలోచనల్లో వున్నట్టు సమాచారం. తమకు కావలసిన వారి లిస్టు తయారు చేసుకొని మరి ముఖ్యనాయకులను కలుస్తున్నారు.

ఏడాది మద్యలో బదిలీ ఉండడంతో కాపురాలు, పిల్లల చదువులతో ఇబ్బంది ఇప్పుడున్న చాలామంది సిబ్బందిలో మూడు ఏళ్ళు పూర్తి చేసుకొన్న వాళ్ళే అదికంగా వున్నారు. వీరిని అనుబంద జీవో176 ప్రకారం మారుమూల మండలాలకు స్థానచాలనం కాక తప్పదు. పట్టణాలలో సుదీర్ఘకాలం పనిచేయడంతో, ఒక్క సారిగా మండలాలకు వెళ్ళడానికి విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఎదో వంకతో మళ్లి అదేస్తానాన్ని అంటిపెట్టుకొనే విధంగా పైరవీలు చేస్తున్నారు. కొందరు ఉద్యోగులు మంత్రుల స్తాయిలో పైరావీలు చేస్తున్నట్టు సంమచారం. మరికొంత మంది ఖాళీ స్థానాల్లో నియామకం కోసం ప్రత్యేక జివో కోసం ప్రత్నిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఈ భాదిలీల పక్రీయ ఉద్యోగులకు తలనొప్పిగా మారింది.

టీచర్ల బదిలీకోసం ప్రత్యేక ఉత్తర్యులు విడుదల కావలసి వుంది. రేపో మాపో ఉత్తర్వులు విడుదల చేసే అవకాశం వుంది. ఈ నేపద్యంలో విద్యాశాఖ జిల్లలో ఖాళీలు సేకరించే పనిలో పడింది. మొత్తం మీద జిల్లాలోని ఆఫీసుల్లోబదిలీల హడావిడి స్పష్టం గా కనిపించింది.