*చిత్తూరు లో రాజ్యమేలుతున్న నకిలీ మందులు *

*చిత్తూరు లో రాజ్యమేలుతున్న నకిలీ మందులు *
జబ్బు పడి ఆసుపత్రిలో చేరిన రోగికి గోరుచుట్టు పై రోకలి పోటులా…నకిలీ మందులు మరింత కుంగ తీస్తున్నాయి. నకిలీ మందులతో ఉన్న రోగం తగ్గక పోగా జేబులు మాత్రం గుల్లా అవుతున్నాయి మాయ మందుల కంపనీలు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నా నియంత్రణ అధికారులు మాత్రం ఛోద్యం చూస్తున్నారు. వినియోగ దారులు చైతన్య వంతు లైతే నే నకిలీ మందుల పని పట్టచంటున్నాయి చట్టాలు.
వాతావరణం ,నీరు,ఆహరం విషపురితమై గంపెడు రోగాలు పట్టి పీడిస్తున్నాయి నేటి సమాజాన్ని.సీసనల్ వ్యాదులు ,దీర్గాకాలిక వ్యాదులతో ప్రజలు ఆసుపత్రుల పాలవుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం అందక ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు .ఆస్పత్రులకు వచ్చే రోగులకు నకిలీ మందులు అంటగడుతూ వారి జేబులకు చిల్లు పెడుతున్నారు. ఉన్న రోగం తగ్గక పోగా ..నకిలీ మందులతో మరిన్ని దుష్ఫలితాలు సంబవిస్తున్నాయి .అక్రంమార్జనకు మరిగిన కంపెనీలు వైద్యులకు కమీషన్ అందించి ..తమ మాయమందులు మార్కెటింగ్ చేసుకుంటున్నాయి. రాయల సీమ జిల్లా ల లో ఏడాదికి 150 కోట్ల రూపాయల నకిలీ మందులు లావా దేవి జరుగుతున్నట్లు అంచనా.
చిత్తూరు జిల్లా లో 650 ప్రైవేటు ఆసుపత్రులు ,3200 మంది ఆర్ యం పి వైద్యులు ఉన్నారు వీరిలో అధిక మందిని నకిలీ కంపనీలు లోబర్చుకున్నాయి. స్థానిక వైద్యులకు 40 శాతం కమీషన్ ముట్ట చెప్పటం వల్ల..వారి మందులనే ప్రిస్కిప్షన్ లో రాస్తున్నారు. ఈ మందులతో రోగాలు తగ్గక పోగా రోగులు వైద్యులను ,మందులను మారుస్తునారు .
ఈ నకిలీ మందుల బెడద నుంచి వినియోగ దారున్ని రక్షించటానికి పలు చట్టాలు ఉన్నాయి.ఇవి తెలియని ప్రజలు నకిలీలతో పలు ఇబ్బందులు ఎదుర్కుంటునారు.
అయితే చట్టాలు ఎన్ని ఉన్నా ….వాటిని చుట్టాలుగా చేసుకున్న వ్యక్తులు ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారు……. 123

1234

12345