ఆలోచిద్దాం రా ! : 5

parlement

పార్లెమెంటు నడవదు. ఎందుకు నడవనీయరు అంటే వీరు ఆ రోజు ఇదే పని చేసారు కదా అంటారు. (నువ్వు  నేర్పిన విద్యే నీరజాక్ష అన్న చందాన). మరి దీనికి ముగింపు ఏది? పొరభాటున నడుస్తే మాత్రం ఏమై పోతుంది? భూ సేఖరణ చట్టం తెస్తారు .అదెవరికోసం? అంబానీలు అదానీల కోసం.  ఈ రోజు అవినీతికి వ్యతిరేకంగా కంకణం కట్టుకున్న వారు ఆకాశం నుండి  ఊడి పడ్డవారా? కాదే !
అసంఖ్యాక ప్రజలు ప్రత్యక్షంగా పరిపాలన సాగించ లేరు కాబట్టే ప్రతినిదులను ఎన్నుకుంటారు . తమ తరపున పాలన చేస్తారని ఆశిస్తారు. స్విడ్జర్లాండ్లో జనాభా చాలా తక్కువ కాబట్టి అక్కడ ప్రత్యక్ష ప్రజా స్వామ్యం అమల్లో ఉంది. భారత దేశంలో జనాభా ఎక్కువ కాబట్టి ఇది అసాధ్యమే. కాని దేశంలోని ప్రతి వార్డు మెంబరు /కౌన్సిలరు/కార్పోరేటర్లు ఎంత కాదన్నా ప్రజలతో ప్రత్యక్ష సంభంధాలు కలిగి ఉన్నవారే కదా?
ఏదైనా బిల్లు తేవాలనుకుంటే దాని ముసాయిదాను ఎం.పీలకిచ్చి -వారు ఎం.ఎల్.ఏలకు ఇచ్చి – ఆ ఎం.ఎల్.ఏ లు ఏ గ్రౌండులోనో తమ నియోజక వర్గ పరిదిలోని ప్రతి వార్డు మెంబరు /కౌన్సిలరు/కార్పోరేటర్లను సమావేశ పరచి బిల్లు పై వారి అభిప్రాయాలు తీసుకోవచ్చు కదా? వాటికి అనుగునంగా మార్పులు చేర్పులు తేవొచ్చు కదా?
మరి ఈ రోజు సమాచార విప్లవం వచ్చింది.కనీశం ప్రతి ఎం.ఎల్.ఏ /మేయర్ వ్యక్తిగతంగా వెబ్ సైట్లు పెట్టుకుని ప్రజల నుండి ఫీడ్ బ్యేక్ తీసుకుని దానిని హౌస్లో వినిపించ వచ్చు కదా? (కొందరు వెబ్ సైట్లు పెట్టుకున్నప్పటికి వాటిని ఆపరేట్ చేసే సాంకేతిక సమర్థత లేక తమ మనమళ్ళ స్నేహితులతో ” మమ” అనిపిస్తున్నారు .
మహాత్మా గాంధి దేశం నలు మూలలా తిరిగాడు . (హెలికాఫ్టర్లలో కాదు – రైల్లో -మరీ సెకండ్ క్లాస్ కంపార్ట్ మెంటుల్లో) .అందుకే అతనికి ప్రజల మనోగతం ఇట్టే అవగతమైంది. మనవాళ్ళు -కేవలం కార్పోరేటర్ సైతం ఇందుకు సాహసించట్లేదు.
ఎందుకంటారా? రాజకీయాలు మరీ కాస్ట్లి అయి పోయాయి. ఎన్నికల సంస్కరణలని చేంతాడంత సంప్రదింపులు జరుగుతున్నా ఆచరణకు నోచుకున్నవి మాత్రం స్వల్పమే.
ఈ దేశం బాగుపడాలి అంటే రాజకీయాలు – ఎన్నికలు  “చీప్” అవ్వాలి. లేకుంటే చీప్ వ్యక్తులే ఎంపికవుతారు . ఒక చానల్ అధినేతంటే ఏకంగా ప్రజల మీదే -ఓటర్ల మీదే నిందలు మోపుతున్నారు . ప్రజలు అవినీతిని సహించే -ప్రోత్సహించే స్థాయికి చేరుకున్నారన్నది ఆయన అద్యయనం .
ఆ సహనానికి కారణం ఏది ?
తెలియని తనం . ప్రజా స్వామ్యం -ఎన్నికలు -తమ ఓట్ల ప్రాముఖ్యత గురించిన ఆవగాహణ లేక పోవడమే ఇందుకు కారణం. నిరక్షరాస్యుల కథ అటుంచితే డిగ్రీలు చేసి -లక్షల జీతాలతో వెలగ పెడుతున్న వారి మాటేమీ? ఎన్నికల నాడు -ఓటు వేయడం కోసం  శెలవిస్తే  గమ్మతుగా నిద్ర పోతారు .
ఈ రోజు మతతత్వ శక్తులు పుంజుకోవడానికి కారణం యువతకు చరిత్ర పై అవగాహన లేదు . (ప్రపంచ చరిత్ర మాట దేవుడెరుగు) చరిత్ర అంటే కేవలం దేశ స్వతంత్రం కోసం జరిగిన  పోరాటాలు తెలీవు .అందులో గుగ్గి పాలైన లక్షల కుటుంభాల ధీన గాదలు  తెలీవు. కనీశం స్వతంత్ర భారత దేశ చరిత్ర తెలీదు .
ఆరోజు జాతి పిత -స్వతంత్ర పోరాట సారధి మహాత్ముడ్ని సైతం పొట్టన పెట్టుకున్న వారికే పట్టం కట్టారు అంటే ఏమనాలి. తాము గొప్ప తెలివి తేటలు గల వారని – సెంటిమెంట్లకు తావివ్వ బోమని -ప్రగతికే పట్టం కడతామని వారి ఫీలింగ్. కాని జరిగిందేమి?
కొద్దిగా ఆలోచిద్దాం రా ! ఈ దేశం ..ఈ సమాజం స్థితి గతులు ఎందుకిలా ఏడ్చాయో ? దీని పర్యావసనం ఎలా ఉంటుందో కొద్దిగా ఆలోచిద్దాం రా !