ఆలోచిద్దాం రా ! PART: 1

3

నేటికి భారత దేశ జనాభా 125 కోట్లు దాటేసింది. క్వాంటిటి పెరిగి పోవడంతో – అవకాశాలు ఎంత ఎక్కువైనా – పోటీ అంతకంటే ఎక్కువై -పోటిలో నెగ్గడమే కీలకమై – ఫౌల్ ప్లే ఎక్కువై – క్వాలిటి పడి పోయిందా?
క్వాలిటి పడి పోవడంతో – సాటివారిలోనే కాదు తమలో కూడ క్వాలిటి లేదని అర్థమై పోయి మనుషులకే మనుషులంటే చికాకు కలిగి పోయిందా? తెలీదు కాని మానవత్వం మాట అటుంచితే కనీశం భంధువులు ,తల్లి తండ్రులు ,అన్నదమ్ములు ,చివరికి భార్య భర్తల మధ్య కూడ స్వార్థమే పరమావదిగా జీవన విధానం మారి పోయింది.
ఇది ఖర్మ భూమి,పుణ్య భూమి ,వేద భూమి అని ఎంతగా చంకలు గుద్దుకున్నా మనుషుల్లో మానవత్వమే కనుమరుగై పోతూంది. ఇరవై ఏళ్ళకు పూర్వం ఎక్కడో చోట – కేవలం ఎక్సెప్షన్లుగా జరిగిన అమానుషాలన్ని ప్రస్తుతం ఎక్కడ పడితే అక్కడ జరిగి పోతున్నాయి . జనం,సమాజం కూడ వాటిని ఇట్టే దాటుకుంటూ వెళ్ళి పోతున్నారు.
అమానుషం అన్న ఒక్క ముక్కలో దోపిడి,దొంగతనం, మోసం,దగా , హత్య,మాన భంగాలు, లంచ కుండి తనం,అవినీతి ,స్త్రీ హింస, శిశు హింస, అన్నీ ఇమిడి పోతాయి. కాబట్టే అమానుషం అన్న పదాన్ని వాడాను.
ఇవి ఇలానే కొన సాగితే ప్రతి కుటుంభం క్రిమినలైజ్ అయ్యే రోజులు ఎంతో దూరంలో లేదు , ప్రతి కుటుంభ పెద్ద దివాళా తీసే రోజులు ఎంతో దూరంలో లేదు. గన్ మ్యేన్ లేకుండా బెడ్ రూంలోకి వెళ్ళ లేని రోజులొచ్చే రోజులు ఎంతో దూరంలో లేదు .ఇంతకీ ఏమైంది? ఈ మార్పుకు కారణం ఏమిటి?
ఏదో జరుగరానిది జరిగితే ఓ..మన దేశంలో కాదులే అని సరిపెట్టుకోలేం !

గ్లోబల్ విలేజ్ రోజులివి. ఎక్కడో గ్రీసు దేశం దివాళా తీస్తే దాని ప్రభావం యూరో పైన పడి,దాని ప్రభావం డాలర్ మీద పడి ,దాని ప్రభావంతో కరెన్సి చిత్తు కాగితమయ్యే అవకాశం ఉండే రోజులివి.
ఏదో జరుగరానిది జరిగితే ఓహ్.. మన రాష్ఠ్రంలో కాదులే అని సరిపెట్టుకోలేం. ఈ రోజు అమెరికా జరిగిన సంఘఠన ,రేపు అమలాపురంలో జరుగుతుంది. మర్సటి దినం మన వీథిలోనో – మన బస్తిలోనో ఇంత ఏల మన ఇంటిలో సైతం రేపే జరుగవచ్చు .
ఈ విపరీత ధోరణులు ఎక్కడ మొదలయ్యాయి. ఎలా ప్రాకి పోతున్నాయి. వీటికి కారణాలు ఏమిటి.ఆ కారణాలకు గలకారణాలు ఏమిటి? ఆలోచిద్దాం ! పాఠకులు సైతం తమ అనుభవాలను,ఆలోచనలను, విమర్శలను పంచుకుంటే పరిష్కారాలు సైతం లభిస్తాయేమో? చూద్దాం.