ఆలోచిద్దాం రా ! PART: 3

scams

భారతీయుల సగటు ఆయువు ప్రస్తుతం 60+ ఉండొచ్చు గాక. కాని దేశంలో -రాష్ఠ్రాల్లో జరుగుతున్న స్కామొత్తాలను చూస్తుంటే ఆ స్కాంల కథా నాయకులకు అమరత్వం లభ్యమైందా ఏమన్న అనుమానం కలగక మానదు . అప్పట్లో కేంద్ర రాజకీయాలను కుదిపేసిన బోఫర్స్ కుంభకోణం కేవలం 64 కోట్లే. కాని ఈ రోజు దినపత్రికలను చూస్తుంటే -స్కాంల మొత్తాలను చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి.

మొన్న ఒక ప్రజా ప్రతినిథి ఓటుకు నోటు పై స్పందిస్తూ “ఇవన్ని షరా మామూలే-ఉదయాన్నే కాఫి తాగినట్టు” అని వ్యాఖ్యానించారు. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది అక్షర సత్యమే. ఈ స్కాంలకు పాల్పడ్డవారంతా కేవలం డబ్బు పిచ్చితో – ఆ స్కాంలకు పాల్పడ్డారని చెప్పలేము.
ప్రజా జీవితంలో ఉన్నవారు ఎంత కాదన్నా కొంతలో కొంత నిరాఢంభరత ప్రదర్శించ వలసి ఉంది.పైగా స్కాంల దనమా ఇల్లీగల్. వాటిని బహిర్గతమూ చెయ్యలేరు. ఎన్ని భవనాలు కట్టినా ఏదో ఒక భవనంలో మాత్రమే ఉండ గలరు. ఒక భవనంలో ఎన్ని గదులు నిర్మించుకున్నా ఒక గదిలో మాత్రమే పడుకో గలరు . ఈ చిన్న పాటి తర్కం వారికి తెలియదా?
మరి ఎందుకీ దోపిడి? ఎందుకీ అవినీతి? పదవుల కోసం. పదవులు రాబట్టుకోవడం కోసం, పదవుల్లో కొన సాగడం కోసం.అసలు పదవుల్లో ఏముంది? అంతటి ఇందిరా గాంధి ప్రధాన మంత్రిగా ఉండగానేగా స్వంత అంగ రక్షకులచే చంపబడింది కదా? వై.ఎస్.కథ వేరే చెప్పక్కర్లేదు . అంటే పదవులు ప్రాణాలను నిలుపవు.
మరి ఇంకేముంది కారణం. ?
స్వామి వివేకానంద ఒక మాటన్నాడు ” ఈ ప్రపంచంలోనే నీ మనసుకన్నా గొప్ప వస్తువు మరేది లేదు. అలా అనిపిస్తే నీ మనస్సు బలహీనంగా ఉందని అర్థం” ఈ మాట ముమ్మాటికి నిజమే. బలహీనంగా ఉన్న మనస్సు – తనలోని డొల్లతనాన్ని – పూరించుకోవడం కోసం భయిట వస్తువుల పై మొగ్గుతుంది.
పదవుల కోసం, దనం కోసం మరొక దాని కోసం ఉవ్విళ్ళూరే వారంతా బలహీన మనస్కులే. మానసిక దౌర్భల్యం మానసిక రోగం కాదు. ఆ దౌర్భల్యాన్ని కప్పి పుచ్చే ప్రయత్నాలే మానసిక రోగాలుగా అభివర్ణించపడతాయి.
కాన్షి రాం పేరు వినే ఉంటారు . యు.పి మాజి సి.ఎం మాయావతి గాడ్ ఫాదర్ అతను .ఆయన చెప్పేవాడు రాజకీయాల్లో సక్సెస్ అవ్వాలంటె థ్రీ “ఎం”స్ కావాలి. మని,మాఫియా,మీడియా.
నిజంగానే మానవావని పై కరుణ, సేవ చెయ్యాలన్న తపన గలవారు ముందుగా ఈ థ్రీ ఎంస్ సమకూర్చుకోవాలి. రాజకీయాలు పూర్తిగా దనమయమయ్యాయి. స్కాంలకు మూలం ఇదే.
గత ఎన్నికల సమయంలో ఒక నేత ఇలా అన్నారు “ఏముందండి ..గెలిచిన వారు ఇంటికి వెళ్ళి ఏడుస్తారు -ఓడిన వారు కౌంటింగ్ సెంటర్లోనే ఏడుస్తారు” ఎందుకంటే ఒక్కో అభ్యర్ధి అంతగా ఖర్చు పెట్టుకోవల్సి వచ్చిందన్న మాట. రాజకీయాలు అవినీతి మయం కావడానికి మూల కారణం ఎన్నికల వ్యయం.
ఇది ఇంతేనా? ఇదిలా కొనసాగ వలసిందేనా? ఆలోచిద్దాం రా !!