ఆలోచిద్దాం రా ! Part 2

ప్రతి ప్రాణికి తన సర్వైవల్ – వ్యాప్తి ఎంతో ముఖ్యం. ఈ రోజు భారతీయిల సర్వైవల్ సైతం ప్రశ్నార్థకం అయ్యింది అంటే అది అతిశోయక్తి కాదు. మన దేశానికి స్కామ్ అన్నది కొత్త కాదు.నెహ్రు కాలంలోనే స్కామ్ ఉండేది. అయితే అప్పుడు అతని స్వంత అల్లుడే దానిని వేలెత్తి చూపేటంత పరిస్థితి ఉండేది.

 

.un employment
ఆ తరువాత ఇందిర కాలం నాటి స్కామ్‌ల మీద -కేవలం తన పదవిని కాపాడుకోవడానికి తెచ్చి రుద్దిన అత్యవసర పరిస్థితి మీద పోరాడటాని ఒక లోక్ నాయక్ జయప్రకాశ్ ఉండేవారు.
ఇటీవల యుపిఏ -2 సర్కార్ మీద దాని స్కామ్‌ల మీద కనీశం చివరి సం.లోనైనా పోరాడేందుకు మోది తెరమీదకొచ్చారు.
ఇప్పుడు జరుగుతున్నదేమిటి? ఎన్.డి.ఏ సర్కార్ మొదటి సంవత్సరాన్ని పూర్తి చేసుకునే లోపే డజన్ల కొద్ది స్కామ్‌లు భయిట పడుతున్నాయి. వివరణ ఇచ్చుకోవల్సిన మోది నోరు మెదపడం లేదు.

గతంలోని స్కామ్లల్లో సైతం కొందరు ప్రాణాలు పోగొట్టుకున్న మాట వాస్తవమే. కాని నేడు భా.జ.పా పాలిస్తున్న మధ్యప్రదేశ్‌లోని వ్యాపం స్కాంలో జనులు చింతకాయల్లా రాలి పోతున్నారు .
ప్రభుత్వ ఉధ్యోగాలకు ప్రవేశ పరీక్షలు నిర్వహించి -అభ్యర్దులను ఎంపిక చేసే ప్రక్రియలో ఈ స్కామ్ చోటు చేసుకుంది. ఇందులో సంభంధాలున్న 44 మంది దాక ప్రాణాలు పోగొట్టుకునేరు. ఈ ప్రక్రియలో గవర్నర్ కుమారుడు సైతం ఉండడం గమనార్హం.
మనుజుల సర్వైవల్ సుసాధ్యం కావాలంటే ఆరోగ్య వంతమైన తల్లి ,తండ్రి, ఆ తల్లికి వైద్య సదుపాయాలు, పౌష్థిక ఆహారం, వారి ఆర్థిక స్థిరత్వం, విద్యా విదానం తప్పనిసరి.విద్యను ఆర్జించినవారికి ఉధ్యోగవకాశం ఎంతో ముఖ్యం.
కాని మధ్యప్రదేశ్‌లో జరిగిందేమి? లక్షల్ లక్షలు ఆమ్యామ్యాలు దండుకుని అనర్హులకు ఉధ్యోగాలు కట్ట పెట్టేరు. అర్హులు రోడ్డున పడేరు. స్కామ్ భయిట పడగానే రుజువులు,ఆధారాలను రూపు మాపేందుకు వారి ప్రాణాలనే పొట్టన పెట్టుకుంటున్నారు.
ఇదెక్కడో జరిగింది. ఎవరో ప్రాణాలు పోగొట్టుకున్నారనుకుంటే అది పొరభాటే. మంచి విషయాలు ప్రాకడానికి కాలం పడుతుంది. కాని ఇటువంటివి వ్యాప్తి చెందటానికి ఎంతో కాలం పట్టాదు.
ఇది ఏ.పిలో జరగటానికి -మన కుటుంభంలో ఒకరు బలికావడానికి ఎంతో కాలం పట్టదు . ఆలోచించండి. సకామ్లు అంటే అది కేవలం ప్రజా దనానికి సంభందించింది కాదు .ప్రాణాలకు సంభందించింది.
అస్తమానం వీడియో గేమ్సు, క్రికెట్, ఆండ్రాయిడ్ మొబైల్సు,యాప్సుల్లో మునిగి ఉంటే నిండా మునగడం కాయం.
కనీశం మన జీవితాలను సూటిగా ప్రభావించ గల అంశాల గురించిన కనీశ సమాచారమన్నా తెలుసుకుని ఆలోచించి మరి స్పందించాల్సిన అవసరముంది. మెళకువతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది.