కేసులపై విచారణ జరుగుతోంది

కేసులపై విచారణ జరుగుతోంది
-ఆర్‌ఎం జి.మహేశ్వర
పీలేరు డిపోలో కండక్టరు అర్జున, సూపర్వైజర్‌ శ్రీరాములు వాగ్వాదం ఘటనపై డిపో మేనేజర్‌ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోందన్నారు. ఆర్టీసీలో పనిచేస్తున్న మహిళా సిబ్బంది సమస్యలపై ఫిర్యాదులు ఇచ్చినపుడు సత్వర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్టీసీ తిరుపతి రీజియన్‌ పరిధిలోని 14 డిపోల పరిధిలో ఎన్‌ఎంయూ కార్మికులు మెరుపు సమ్మెలో ఉన్నా ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా సుమారు 75 శాతం బస్సులు తిప్పామన్నారు. ఆర్టీసీ ఎన్‌ఎంయూ రాష్ట్ర కార్యదర్శి చల్లాచంద్రయ్య, రీజియన్‌ నాయకులు ఆవుల ప్రభాకర్‌, పురుషోత్తం, బీఎస్‌ బాబు, శ్రీధర్‌రాయల్‌, అన్నారామచంద్రయ్య తదితరులు ఆర్టీసీ ఆర్‌ఎం, డిప్యూటీ సీటీఎంలతో చర్యలు జరుపుతున్నారు.