మాటా-మంతి :అమరావతి

Amaravathi

“ఏంది బాసు ఏం విశేషాలు?”
“ఎలాగో మనకూ ఒక రాజదాని రెడి అయిపోతుంది.ముక్కోడు ముక్కు మీద వేలెట్టుకోవాలి”

* * *
పై సంభాష్ణ చూసారుగా? ఇదే మానవ నైజం. మన దేశంలో లాగే పాకిస్తాన్లో కూడ బీదా బిక్కీ ఉన్నారుగా? మనం మనం గీరుకొని ఒకరిని మరొకరు మించి పోవాలని ఒకే ఫారీన్ కంపెని వద్ద యుద్ద సామగ్రి ఎందుకు కొనాలి అనిపించదు.
రాష్ఠ్రానికి రాజదాని అవసరమే. హైదరాబాదు ఏమైనా ఒక్కరోజున ఆకాశం నుండి ఊడిపడ్డదా? Rome was not built in a day. పులిని చూసి నక్క వాతపెట్టుకున్న చందాన లోటు బడ్జెట్లో ఉన్న రాష్ఠ్రం -కేంద్రం ఏ మాత్రం సాయపడుతుంది? విభజన సమయంలో ఇచ్చిన హామీలను ఏ మెరకు అమలు పరుస్తుంది అన్న బరోసా ఏమాత్రం లేకుండా ఎందుకీ హడావుడి? అని బుర్ర ప్రశ్న వేయదు . మానవ నైజం ఇది.
చిత్తూరులో ఒక నర్సింగ్ కాలేజి వచ్చింది. ఇప్పుడు దాని చుట్టూ ఒక నగర్ ఏర్పడింది. ప్లానా?పాడా? ఏమీ లేదు.కొంపలంటుకు పోయాయా?లేదే ! గవర్నమెంట్ అంటే ఏమి ? గవర్నెన్సు. అంటే ఒక కంట కనిపెడుతుండడం.
నాలుగు బిల్డింగులు కట్టుకుని “కాపురం” పెడితే రాజదాని తనంతట తానే డెవలప్ అవుతుంది. ఏవో కొన్ని నిభంధనలను ఇంపోజ్ చేయొచ్చు. ఇంత వెడల్పు రోడ్డుండాలి , బిల్డింగులకు నడుమ ఇంత గ్యేప్ ఉండాలి అని కొన్ని నిభందనలు పెట్టి -సరిగ్గా అమలయ్యేలా గవర్నెన్సు చేస్తే సరిపోయేది.
ఈ మాట ఎవరైనా అడుగుతారా? ఊహూ. ఎందుకంటే పక్క రాష్థ్రాన్ని చూసి ఓర్వలేని తనం,ఈర్ష్యా,ద్వేషం,ప్రెస్టెజ్.