సెల్కు ఛార్జింగ్ పెడుతున్నారా! జాగ్రత్త!

cell

కర్నూలు జిల్లా పెద్దకుడుబూరు మండలం మేకదోన గ్రామంలో సెల్ ఛార్జింగ్ పెడుతూ ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. గ్రామానికి చెందిన ఖలీల్(28) గురువారం రాత్రి తన ఇంట్లో సెల్ చార్జింగ్ పెడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే చనిపోయాడు. ఖలీల్‌కు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు.

సెల్కు ఛార్జింగ్ పెట్టే సమయంలో పేలిపోవడం, షాక్ కొట్టడం వంటి సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. సెల్కు ఛార్జింగ్ పెట్టే సమయంలో జాగ్రత్తలు పాటించవలసిన అవసరాన్ని ఈ సంఘటనలు గుర్తు చేస్తున్నాయి.