నిరాశపరిచిన యువరాజ్

India's Yuvraj Singh celebrates taking the wicket of The Netherlands' Wesley Baressi during their ICC Cricket World Cup group B match in New Delhi

చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆటగాడు యువరాజ్ సింగ్ నిరాశపరిచాడు. కేవలం 9 పరుగులు మాత్రమే చేసి ఐదో వికెట్ గా అవుటయ్యాడు. కీలక దశలో బ్యాటింగ్ కు దిగిన యువీ 6 బంతులు ఎదుర్కొని ఫోర్ తో 9 పరుగులు సాధించాడు. బ్రావో బౌలింగ్ లో పాండేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. యువరాజ్ స్వల్ప స్కోరుకే వెనుదిరగడంతో అభిమానులు నిరాశ చెందారు.తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన కెప్టెన్ డుమిని(5) కూడా స్వల్ప స్కోరుకే అవుటయ్యాడు. దీంతో మ్యాచ్ చెన్నై వైపు మొగ్గింది.