తిరుమలలో తలనీలాలు తీయడం ఉచితం.

ttd

తిరుమల శ్రీవారికి తలనీలాలు ఇచ్చే కార్యక్రమాన్ని పూర్తిగా ఉచితంగా నిర్వహించనున్నట్లు టీటీడీ జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు వెల్లడించారు. గురువారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ప్రధాన కల్యాణకట్టలతోపాటు మినీ కల్యాణకట్టల్లో మాత్రమే భక్తులకు తలనీలాలు ఉచితంగా తీసే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. మినీ కల్యాణకట్టల్లో రూ.10 టికెట్టు వసూలు చేస్తున్నామని, అక్కడ కూడా ఇకపై ఉచితంగానే నిర్వహిస్తామన్నారు.

అలాగే, భక్తుల నుంచి డిమాండ్ అంతగా లేని టీబీసీ, నారాయణగిరి, విష్ణుపాదం, పాంచజన్యం, కౌస్తుభం, సన్నిధానం, సుదర్శన్‌తోపాటుమరో రెండు కేంద్రాలను మే 1వ తేదీ నుంచి మూసివేస్తామన్నారు. అన్నిచోట్లా సీసీ కెమెరాలతో నిఘా పెడతామని చెప్పారు. వేసవి సెలవుల్లో తలనీలాలు తీసే విషయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.